Budget : లక్ష కోట్లు అడిగితే ..కేవలం రూ.15 వేల కోట్లే ఇస్తారా..? – బడ్జెట్ ఫై షర్మిల ఆగ్రహం

'ఇది బడ్జెట్ కాదు.. ఎన్నికల మ్యానిఫెస్టో. ఏది పడితే అది చెప్పొచ్చు

  • Written By:
  • Publish Date - July 23, 2024 / 05:33 PM IST

బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేక కేటాయింపుల పట్ల కూటమి శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తుంటే..కాంగ్రెస్ పార్టీ మాత్రం విమర్శలు చేస్తుంది. ఏపీకి కేటాయించిన బడ్జెట్ ఫై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైస్ షర్మిల (sharmila ) ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రబాబు లక్ష కోట్లు అడిగితే ..కేవలం రూ.15 వేల కోట్లే ఇస్తారా..? ఇక పోలవరానికి ఎన్ని నిధులు ఇచ్చారని ప్రశ్నిస్తూ షర్మిల పలు అంశాల గురించి ప్రశ్నిచింది. రాజధాని అమరావతికి 15 వేల కోట్ల ప్రత్యేత సాయాన్ని (Funds to AP in Union Budget) అందిస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. అదే విధంగా పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు, పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

హైదరాబాద్ – బెంగుళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి కూడా ప్రత్యేక నిధులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్‌, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. ‘ఏపీ విభజన చట్టానికి కట్టుబడి ఉన్నాం. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సాయం చేస్తాం. విభజన చట్టంలో పొందుపరిచినట్లుగా వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సాయం అందించడం సహా రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తాం.’ అని మంత్రి పేర్కొన్నారు.

కాగా ఈ కేటాయింపు ఫై షర్మిల పలు డిమాండ్స్ వ్యక్తం చేసింది. ‘ఇది బడ్జెట్ కాదు.. ఎన్నికల మ్యానిఫెస్టో. ఏది పడితే అది చెప్పొచ్చు. ఏదైనా హామీ ఇవ్వొచ్చు. బడ్జెట్ అంటే అంకెలు ఉండాలి. కాలపరిమితి ఉండాలి. ఇది పూర్తిగా మేనిఫెస్టో ‘ అని షర్మిల విమర్శించారు. చంద్రబాబు రూ.లక్ష కోట్లు కావాలని అడిగేతే కేవలం రూ.15 వేల కోట్లే ఇచ్చారని..అది కూడా దేనికి ఎంత అనేది చెప్పలేదన్నారు. పోలవరం మీద ఎన్నో కబుర్లు చెప్పారని.. లైఫ్ లైన్ .. ఫుడ్ సేఫ్టీ ..ఇలా ఎన్నో చెప్పారు చివరకు పోలవరానికి ఎన్ని కోట్లు ఇస్తామనేది మాత్రం చెప్పలేదన్నారు. ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్ కి ఎంత నిధులు ఇస్తారు? హామీలు ఇస్తే సరిపోతుందా? రూ.500 కోట్లు ఇస్తారా? రూ.5 వేల కోట్లు ఇస్తారా? బడ్జెట్ అంటే అంకెలకు సంబంధించిన విషయం. కానీ ఈ బడ్జెట్ లో కబుర్లు మాత్రమే చెప్పారని షర్మిల మండిపడ్డారు. ప్రత్యేక హోదా అనే అంశం ఊసే లేదు. విభజన హక్కులను గౌరవిస్తాం అన్నారు. విభజనలో మొదటి అంశం హోదా. అసలు విషయం పక్కన పెట్టి, ఇతర విషయాలు ఇస్తాం అంటున్నారు అంటూ షర్మిల వాపోయింది.

Read Also : Union Budget 2024-25 : ఏపీకి ప్రత్యేక కేటాయింపుల పట్ల జనసేన హర్షం

Follow us