Site icon HashtagU Telugu

Balakrishna : బాలయ్య ను మంత్రిగా చూస్తామా..?

Balakrishna

Balakrishna

ఏపీలో కూటమి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 164 అసెంబ్లీ , 21 పార్లమెంట్ స్థానాలు సాధించి తిరుగులేని విజయం అందుకుంది. జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ , 2 లోక్ సభ స్థానాల్లో విజయం సాధించి 100 % విక్టరీ ని అందుకుంది. ఈ విజయం తో కూటమి శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో హిందూపురం నుండి హ్యాట్రిక్ విజయం సాధించిన నందమూరి బాలకృష్ణ కు మంత్రి పదవి దక్కుతుందా ..లేదా అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

బాలకృష్ణ చిత్రసీమలో హీరోగా రాణిస్తూనే..ఇటు రాజకీయాల్లో రాణిస్తున్నారు. సినిమాల పరంగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాల విజయంతో హ్యాట్రిక్ కొట్టారు. మరోవైపు హిందూపురం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రాజకీయాల్లోనూ హ్యాట్రిక్ సాధించారు. రెండు రంగాల్లో బాలయ్య అన్జపబుల్గా దూసుకెళ్తున్నారని ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. అయితే ఈ ఖుషిలోనే ఆయనకు ఈసారి మంత్రి ఛాన్స్ ఇస్తే ఫుల్ హ్యాపీ అని అంటున్నారు. 2014 నాటి చంద్రబాబు మంత్రివర్గంలో బాలయ్యకు స్థానం దక్కలేదు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు చంద్రబాబు మొండిచేయి చూపించారు. ఈసారైనా బాలకృష్ణకు మంత్రి పదవి వస్తుందని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ కొడుకుగా, పార్టీ సీనియర్ నేతగా ఉన్న బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈసారి బాబు ఏంచేస్థాడో చూడాలి. ఈ నెల 12 న చంద్రబాబు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబదించిన ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.

ఇక రేపు నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్బంగా ఆయన నటిస్తున్న ‘NBK 109′ నుండి ఫైరింగ్ ట్రీట్ రానున్నట్లు తెలుస్తోంది. బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ఊర్వశీ రౌతేలా హీరోయిన్గా నటిస్తున్నారు. బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అక్టోబర్ 10న మూవీ విడుదల కానున్నట్లు టాక్.

Read Also : Modi 3.0 : మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోడీ

Exit mobile version