ఆంధ్రా యూనివర్సిటీలో హిందీ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎన్ సత్య నారాయణ పై లైంగిక ఆరోపణలు వచ్చాయి. ప్రోఫెసర్ సత్యనారాయణపై రీసెర్చ్ స్కాలర్ సోనాలి ఘటక్ జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ప్రీ – టాక్ వైవా కోసం రెండు లక్షలు డిమాండ్ చేశారని, 75 వేలు తీసుకున్నారని, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని హెచ్ అర్ సీ కి ఇచ్చిన ఫిర్యాదు లో స్కాలర్ సోనాలి ఘటక్ పేర్కొంది. మిగతా డబ్బు చెల్లించలేదని తన భర్త పై ఎస్ సీ,.ఎస్టీ కేసు పెట్టీ బ్లాక్ మెయిల్ చేశారని ఫిర్యాదు లో పేర్కొంది. లైంగిక వేధింపులపై ఏయూ రిజిస్ట్రార్, వీసీకు కూడా ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు ఇంకా స్పందించలేదు. అయితే దీనిపై ఆంధ్రా యూనివర్సిటీ హిందీ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎన్ సత్య నారాయణ వివరణ ఇచ్చారు. స్కాలర్ సోనాలి తమ డిపార్ట్మెంట్ లో ఎప్పుడూ అడుగుపెట్టలేదని.. ఆ అమ్మయి ఎవరో తనకు తెలియదని చెబుతున్నారు. సోనాలి ఎగ్జిక్యూటివ్ కోటాలో జాయిన్ అయ్యిందని..ఇంకా ఎన్రోల్ కూడా కాలేదన్నారు. తన తప్పుంటే..తనను సస్పెండ్ చెయ్యండి అని వీసీకి చెప్పానని సత్యనారాయణ వివరణ ఇచ్చారు.
Sexual Harassment : ఆంధ్రాయూనివర్సిటీ ప్రోఫెసర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు

Crime