Telugu States Issue: షా చాటు జ‌గ‌న్‌.!

ద‌క్షిణ భార‌త రాష్ట్రాల స‌మావేశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని జ‌గ‌న్ భావించిన‌ప్ప‌టికీ ఆశించిన ఫ‌లితాన్ని రాబ‌ట్ట‌లేక‌పోయాడు.

  • Written By:
  • Updated On - November 15, 2021 / 10:42 PM IST

ద‌క్షిణ భార‌త రాష్ట్రాల స‌మావేశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని జ‌గ‌న్ భావించిన‌ప్ప‌టికీ ఆశించిన ఫ‌లితాన్ని రాబ‌ట్ట‌లేక‌పోయాడు. విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాల‌ను ప‌రిష్క‌రించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేక క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని ఆయ‌న చేసిన విజ్ఞ‌ప్తిని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. పైగా ఆ స‌మావేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజ‌రు కాలేదు. ఆయ‌న‌తో పాటు త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్‌, కేర‌ళ సీఎం పిన‌య్ రంజ‌న్ కూడా క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఎన్డీయే భాగ‌స్వామ్యంలోని ప్ర‌భుత్వాధిప‌తుల స‌మావేశం మాదిరిగా జ‌రిగింది. దానికి సీఎం జ‌గ‌న్ కీల‌కంగా మారాడు. ఆయ‌న ఉప‌న్యాసంలో అనేక అంశాలు పొందుప‌రిచిన‌ప్ప‌టికీ హామీ మాత్రం ఆ స‌మావేశం నుంచి స్ప‌ష్టంగా ల‌భించ‌లేదు. ప్ర‌త్యేక హోదా, పోలవ‌రం, విశాఖ రైల్వే జోన్, వెనుక‌బ‌డిన ప్రాంతాల‌కు ప్ర‌త్యేక ప్యాకేజీ, ఆర్థిక లోటు త‌దిత‌రాల‌ను ఏక‌రువు పెట్టాడు. తెలంగాణ నుంచి విద్యుత్ బ‌కాయిల రూపంలో ఏపీకి రావాల్సిన సుమారు రూ. 6వ కోట్ల‌ను ఇప్పించాల‌ని కూడా అర్థించాడు. సాదాసీదాగా ఆ స‌మావేశం జ‌గ‌న్ మాట‌ల‌ను తీసుకుంది మిన‌హా సీరియ‌స్‌గా స్పందించిన దాఖ‌లాలు లేవు.

Also Read : ఏపీపై `రెడ్` నోటీస్.. గ‌వ‌ర్న‌ర్ పాల‌న దిశ‌గా ..?

ఇరు రాష్ట్రాల న‌డుమ నీళ్లు, నిధులు, నియామ‌కాల‌తో పాటు విభ‌జ‌న చ‌ట్టంలోని షెడ్యూల్ 10,11ప్ర‌కారం రావాల్సిన ఆస్తుల గురించి జ‌గ‌న్ ప్ర‌స్తావించాడు. ఈ అంశాలు రాబోవు రోజుల్లో ఇరు రాష్ట్రాల మ‌ధ్య సెంటిమెంట్ ను , వివాదాల‌ను ర‌గిల్చే అవ‌కాశం ఉంద‌ని చెప్పాడు. అందుకే, ముందుగానే అమిత్ షా ఆధ్వ‌ర్యంలో ఒక క‌మిటీని కేంద్రం ఏర్పాటు చేయాల‌ని జ‌గ‌న్ కోరాడు. ఆ క‌మిటీ విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాల‌ను విడ‌త‌ల‌వారీగా ప‌రిష్క‌రించాల‌ని సూచించాడు. లేదంటే, ఏపీ మ‌రింత న‌ష్ట‌పోయే ప్ర‌మాదం ఉంద‌ని వేడుకున్నాడు.తెలంగాణ తలసరి ఆదాయం రూ. 15,454 కాగా, ఆంధ్రప్రదేశ్ రూ. 8,979గా ఉందనే నిజాన్ని జ‌గ‌న్ బ‌య‌ట‌పెట్టాడు.కాగ్ ఆడిట్ చేసిన 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లెక్కల ప్రకారం, జూన్ 2, 2014 నుండి మార్చి 31, 2015 వరకు రెవెన్యూ లోటు రూ. 16,078.76 కోట్లు. అదనంగా, ఆ కాలానికి సంబంధించి ఇతర ఆర్థిక బాధ్యతలు ఉన్నాయి. డిశ్చార్జ్ కాలేదు, ఇది ఆ ఆర్థిక సంవత్సరానికి వనరుల అంతరంలో భాగంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా, ఆ ఆర్థిక సంవత్సరంలో మొత్తం వనరుల గ్యాప్ రూ. 22,948.76 కోట్లుగా ఉంది.

Also Read : పశ్చిమ కనుమలను కాపాడుతున్న వీరవనితలు

అయితే, కేంద్రం తదనంతరం ‘ప్రామాణిక వ్యయం’ అనే కొత్త కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టింది మరియు రాష్ట్రానికి పరిహారం చెల్లించాల్సిన బాధ్యత కేవలం రూ. 4,117.89 కోట్లు మాత్రమే అని తెలియజేసారు, జగన్ మాట్లాడుతూ, ఈ సమస్యపై సరైన పరిష్కారం కనుగొనడానికి అమిత్ షాను పునరాలోచించాలని కోరారు.ద‌క్షిణాది రాష్ట్రాల స‌మావేశంలో జ‌గ‌న్ విన్న‌వించిన అంశాల‌న్నీ ప్ర‌తిసారి ఢిల్లీ వెళ్లిన‌ప్పుడు విన‌తిప‌త్రం రూపంలో ప్ర‌ధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాకు తెలియ‌చేసిన‌వే. కొత్త‌గా జ‌గ‌న్ ఈ స‌మావేశంలో ప్ర‌స్తావించిన అంశాలు చెప్ప‌కోద‌గిన‌వి లేవు. ప్ర‌త్యేక హోదాను ప్ర‌స్తావించ‌కుండా 14 ఆర్థిక సంఘం ఏర్పాటు దాని తీర్మానాల తేదీ గురించి మాత్ర‌మే జ‌గ‌న్ ప్ర‌స్తావించాడు. మొత్తం మీద అమిత్ షా ను బ‌తిమ‌లాడుకోవ‌డం మిన‌హా జ‌గ‌న్ సాధించింది శూన్యం. పైగా తెలంగాణ ప్ర‌భుత్వం నుంచి స‌హ‌కారాన్ని రాబ‌ట్ట‌లేక‌, కేంద్ర క‌మిటీని వేయాల‌ని సూచించాడు. ఇప్ప‌టికే కృష్ణా న‌ది పైన కేంద్ర గెజిట్ ఇవ్వ‌డంతో మండిప‌డుతోన్న తెలంగాణ ప్ర‌భుత్వం ఇప్పుడు మ‌ళ్లీ మ‌రో క‌మిటీ విభ‌జ‌న చ‌ట్టాల‌పై వేస్తే భ‌గ్గ‌మనే ఛాన్స్ లేక‌పోలేదు. మొత్తం మీద అమిత్ షాను న‌మ్ముకున్న జ‌గ‌న్ ఏపీని గ‌ట్టెక్కిస్తారా? మ‌రింత దిగ‌జార్చుతారా? అనేది చూడాలి.