Second Day of Vizag GIS: విశాఖ సదస్సు రెండో రోజు 8 రంగాలపై సెషన్లు

రెండవ రోజు శనివారం ప్రతిష్టాత్మక గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ 2023 ప్రారంభమైంది. రెండో రోజు ఉదయం ఆడిటోరియం 1లో పెట్రోలియం అండ్‌ పెట్రో కెమికల్స్,

Published By: HashtagU Telugu Desk
Second Day of Vizag Global Investors Summit

A Lot Of Investment! Visakha Conference Secret!!

రెండవ రోజు (Second Day) శనివారం ప్రతిష్టాత్మక గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ 2023 ప్రారంభమైంది. రెండో రోజు (Second Day) ఉదయం ఆడిటోరియం 1లో పెట్రోలియం అండ్‌ పెట్రో కెమికల్స్, 2లో హయ్యర్‌ ఎడ్యుకేషన్, 3లో స్కిల్‌ డెవలప్‌మెంట్, 4లో వియత్నాం కంట్రీ సెషన్‌ జరగనుంది. 9.45 గంటలకు ఆడిటోరియం 1లో టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ, 2లో టెక్స్‌టైల్స్‌ అండ్‌ అపరెల్స్, 3లో ఫార్మాస్యూటికల్స్‌ అండ్‌ లైఫ్‌ సైన్సెస్, 4లో వెస్టర్న్‌ ఆస్ట్రేలియా కంట్రీ సెషన్‌ ఉంటుంది. ఆ తర్వాత నోవా ఎయిర్‌ సీఈఓ అండ్‌ ఎండీ గజానన్‌ నాబర్, అవాడ గ్రూప్‌ చైర్మన్‌ వినీత్‌ మిట్టల్, లారస్‌ ల్యాబ్స్‌ ఫౌండర్‌ అండ్‌ సీఈఓ సత్యనారాయణ చావ, హెటిరో గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఎండీ డాక్టర్‌ వంశీ కృష్ణ బండి, గ్రీన్‌కో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అనీల్‌కుమార్‌ చలమశెట్టి, సెయింట్‌ గోబిన్‌ ఆసియా–పసిఫిక్‌ అండ్‌ ఇండియా సీఈఓ సంతానం ప్రసంగాలు ఉంటాయి. అనంతరం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, అపాచీ అండ్‌ హిల్‌టాప్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ అండ్‌ గ్రూప్‌ హెడ్‌ ఇండియా ఆపరేషన్స్‌ సర్జియో లీ, బ్లెండ్‌ హబ్‌ ఫౌండర్‌ హెన్‌రిక్‌ స్టామ్‌ క్రిస్టెన్‌సన్, వెల్‌స్పన్‌ గ్రూప్‌ ఎండీ రాజేష్‌ మండవేవాలా, వెల్‌స్పన్‌ గ్రూప్‌ ఎండీ సతీష్‌రెడ్డి, భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ ఎండీ, సీఐఐ సదరన్‌ రీజియన్‌ చైర్‌పర్సన్‌ సుచిత్ర కె.ఎల్లా ప్రసంగిస్తారు. ఆ తర్వాత కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, కేంద్ర పోర్టులు, షిప్పింగ్‌ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌ కీలక ఉపన్యాసం ఉంటుంది. అనంతరం సమ్మిట్‌ వేదికపై నుంచి కొత్త పరిశ్రమ యూనిట్ల ప్రారంభోత్సవం, సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ముగింపు ఉపన్యాసం ఉంటుంది.

Also Read:  Investment in AP: పెట్టుబడుల గుట్టు! విశాఖ సదస్సు రహస్యం!!

  Last Updated: 04 Mar 2023, 12:18 PM IST