AP Deaths: ఏపీలో ఘోర జల ప్రమాదాలు, ప్రతి ఏటా 1000 మంది దుర్మరణం!

ఏపీలో గత ఐదేళ్లలో 52 పడవ బోల్తా ఘటనలు ఏకంగా 60 మందిని బలిగొన్నాయి.

  • Written By:
  • Updated On - December 20, 2023 / 12:35 PM IST

AP Deaths: 2017- 2022 మధ్య ఆంధ్రప్రదేశ్‌లో 10,076 మంది నీట మునిగి ప్రాణాలు కోల్పోయారని, వీరిలో ఎక్కువ మంది యువకులేనని (NCRB) తమ రిపోర్ట్ లో తెలిపింది.  ఈ కాలంలో APలో 9,500 కంటే ఎక్కువ ఇటువంటి సంఘటనలు జరిగాయి. వీటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మరణాలు ఉన్నాయి. అవగాహన పెంపొందించడం, నీటి చెరువుల దగ్గర, చుట్టుపక్కల మెరుగైన భద్రతా చర్యలు, పిల్లలు, యువకులకు ఈత పాఠాలు నేర్పడం వంటి వాటి అవసరం. ఈ జాగ్రత్తలతో భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలకు చెక్ పెట్టాలని సూచించారు.

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) విడుదల చేసిన డేటా ప్రకారం 2020లో ఈ మరణాలు ఎక్కువగా నమోదయ్యాయి. 1,699 సంఘటనల్లో 1,799 మంది మరణించారు. 2022లో 1,777 మంది నీట మునిగి చనిపోయారు. 2018లో 1,596 ఘటనల్లో 1,666 మంది ప్రాణాలు కోల్పోయారు. 2021లో 1,539 ఘటనల్లో మునిగి 1,646 మంది ప్రాణాలు కోల్పోయారు. 2017లో 1,507 ఘటనల్లో 1,634 మంది ప్రాణాలు కోల్పోగా, సగటున 1,5514 మంది ఏపీలో 149011 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రతి సంవత్సరం కనీసం 1,500 నుండి 1,600 మంది నీట మునిగి మరణిస్తున్నారు మరియు బాధితులలో ఎక్కువ మంది యువకులే,” అని డేటా చూపించింది.

నీటి వనరులు (నదులు, రిజర్వాయర్లు, బీచ్‌లు మొదలైనవి) గురించి తెలియకపోవడం, ఈత గురించి ప్రాథమికంగా తెలియకుండా వాటిలోకి  దూకడం ఈ మరణాలకు కారణాలు  అని పోలీసు అధికారి తెలిపారు. చెరువులు, బావులు, సముద్రాల దగ్గర హెచ్చరిక బోర్డులు ఉన్నప్పటికీ యువకులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఏపీలో గత ఐదేళ్లలో 52 పడవ బోల్తా ఘటనలు ఏకంగా 60 మందిని బలిగొన్నాయి. 2019 సెప్టెంబరులో తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు సమీపంలో గోదావరి నదిలో పర్యాటక బోటు బోల్తా పడడంతో కొంతమంది చిన్నారులు సహా 51 మంది మునిగిపోవడం గమనార్హం.