ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) కు రేపు (సెప్టెంబర్ 1) ఎంతో ప్రత్యేకం. 1978లో 28 ఏళ్ల వయసులో ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభలో ప్రవేశించాక ఇప్పటి వరకు ఆయన 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం అత్యంత స్ఫూర్తిదాయకం. 1995లో టీడీపీలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో సెప్టెంబరు 1న ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రెండు దఫాలు, నవ్యాంధ్రకు ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ఇప్పుడు నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
ఆనాడు జన్మభూమి వంటి కార్యక్రమాలతో ప్రజలను కూడా పాలనలో భాగస్వాములను చేశారు. ఒక పనిని సాధించాలంటే విజన్‌తో కూడిన స్పష్టమైన ప్రణాళిక అవసరం. అలాగే రాష్ట్రానికి దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి. అదే చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ ‘విజన్-2020’. అప్పట్లో వెక్కిరించిన వారు.. ఆ విజన్ డాక్యుమెంట్ ఫలితాలను ప్రత్యక్షంగా చూస్తున్నారు. మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలను ఆంధ్ర ప్రదేశ్ కు రప్పించి గ్లోబల్ ఐటీ రంగాన్ని రాష్ట్రంపై దృష్టి సారించేలా చేయడం వల్ల లక్షలాది ఐటీ ఉద్యోగాలు వచ్చాయి. ఐటీ ఉద్యోగాలకు నిపుణులను సిద్ధం చేసేందుకు ఇంజినీరింగ్ కాలేజీలు పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చాయి. ఈరోజు తెలంగాణ ఎంత అభివృద్ధి జరిగిందంటే దానికి తొలిమెట్టు వేసింది చంద్రబాబే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
We’re now on WhatsApp. Click to Join.
అలాంటి బాబు ఏపీలో జరిగిన ఈ ఎన్నికల్లో అసాధారణ విజయం సాధించి నాలుగోసారి సీఎంగా, ఇటు రాష్ట్రంలో, అటు కేంద్ర ప్రభుత్వంలోనూ కీలక భూమిక పోషించారు. ఐదేళ్ల క్రితం ఎన్నికల్లో కేవలం 23 స్థానాలకు పరిమితమైన దశ నుంచి జగన్ వంటి అరాచక, విధ్వంసకర పాలకుడికి ఎదురొడ్డి పోరాడి, చంద్రబాబు అద్భుత విజయం సాధిస్తారని, మిత్రపక్షాలతో కలసి 164 స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వస్తారని, నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని అప్పట్లో ఎవరూ ఊహించి ఉండరు. అలాంటి అసాధ్యాల్ని సుసాధ్యం చేయడం ఆయన నైజం. ఇక సీఎం గా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుండే తన మార్క్ కనపరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నింపుతూ..ఈరోజు టాప్ 5 సీఎం లలో ఒకరిగా గుర్తింపు సాధించారు.
సాధారణంగా ప్రతి ఒక్కరూ పుట్టినరోజు లేకుంటే పెళ్లి రోజు అంటూ గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. లేకపోతే ఫలానా రోజున తనకు కలిసివచ్చిన రోజు అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే 1995 సెప్టెంబర్ 1న చంద్రబాబు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేశారు. ఎన్టీఆర్ మరణానంతరం సొంత మెజారిటీతో పార్టీ అధ్యక్షుడై..ప్రజల ఆమోదం పొంది ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన రోజు అది. అందుకే టీడీపీ శ్రేణులు 30 సంవత్సరాల వేడుకలు జరిపేందుకు సిద్ధం అవుతున్నారు.
Read Also : Putin : మంగోలియాకు పుతిన్.. అరెస్టు చేసి ఐసీసీకి అప్పగిస్తారా ?