Site icon HashtagU Telugu

Kodali Nani : అమరావతి రైతుల పాదయాత్రపై సంచలన వ్యాఖ్యలు..!!

అమరావతి రైతుల పాదయాత్రపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి కొడాలి నాని. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి ఉద్యమాన్ని ప్రజలు హర్షించారు అన్నారు. ఎవరీ అన్యాయం చేయకూడదన్న ఉద్దేశ్యంతోనే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు నాని చెప్పారు. రాష్ట్ర సంపదంతా ఒకే చోట పెడితే ప్రాంతీయ విద్వేషాలు వస్తాయన్నారు. ప్రజల శ్రమ అమరావతికే పెడితే హైదరాబాద్ లో ఏర్పడిన పరిస్థితి అమరావతిలోనూ ఏర్పడుతుందంటూ జోస్యం చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్ ను కోల్పోయి ఎంతోగానో నష్టపోయామన్నారు కొడాలి నాని.

ఇక మహాపాదయాత్రను ఉద్దేశిస్తూ మంత్రి బొత్స ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రైతుల మహాపాదయాత్ర ఒక్క అడుగు ముందుకు వేయకుండా అడ్డుకోవాలంటూ పిలుపునిచ్చారు. బీజేపీ నేతలు రాజధాని విశాఖకు వ్యతిరేకంగా స్టేట్ మెంట్స్ ఇస్తున్నారంటూ బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో వికేంద్రీకరణ అంశాలను పెట్టామని..వెల్లడించారు. 29 గ్రామాలు ఒక ప్రాంతం ఒక వర్గం కోసం ప్రభుత్వం ఆలోచించదన్నారు. రైతుల ముసుగులో టీడీపీ చేస్తున్న పాదయాత్రకు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు బొత్స.