MP Keshineni Nani: ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు..కాల్ మని, కబ్జా, మాఫీయా డాన్ లకు టికెట్ ఇస్తే..!

విజయవాడ ఎంపీ కేశినేని నాని (MP Keshineni Nani) మరోసారి సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేసారు. ట్డీపీ ప్రక్షాళన కావాలన్నది తన కోరికని.. కేశినేని చిన్నే కాదు, మరో ముగ్గురు వ్యక్తులు టికెట్ ఇస్తే తన మద్దతు ఉండదని తేల్చి చెప్పారు.

Published By: HashtagU Telugu Desk
Vijayawada TDP

Kesineni Nani

విజయవాడ ఎంపీ కేశినేని నాని (MP Keshineni Nani) మరోసారి సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేసారు. టీడీపీ ప్రక్షాళన కావాలన్నది తన కోరికని.. కేశినేని చిన్నే కాదు, మరో ముగ్గురు వ్యక్తులు టికెట్ ఇస్తే తన మద్దతు ఉండదని తేల్చి చెప్పారు. ఎంపీ టికెట్ పై తనకో క్లారిటీ ఉందని.ఎంకరప్షన్ కోసం నేను రాజకీయాల్లోకి రాలేదన్నారు. తాను జీవితంలో ఎవరిని మోసం చేయలేదన్నారు ఎంపీ కేశినేని నాని. తన కంటే చిన్ని యాక్టివ్ గా ఉంటే మంచిదేనని బదులిచ్చారు.

ప్రజాస్వామ్యంలో ఎవరికైనా తిరిగే హక్కు ఉందని..చార్లెస్ సోబ్రాజ్, దావుద్ ఇబ్రహీం సెక్స్ రాకెట్, కాల్ మని చేసేవాళ్ళు కూడా పోటీ చేసే హక్కు ఉందని ఎంపీ కేశినేని నాని అన్నారు. గాంధీ లాంటి మంచి వారికి సీటు ఇవ్వొచాని.. దావుద్ ఇబ్రహీం లాంటి వారికి.. భూకబ్జా దారులకి, ఉమెన్జర్ కి ఇవ్వొచ్చున్నారు. ఎన్టీఆర్ గొప్ప ఆశయం తో టీడీపీ స్థాపించారని..ఆ ఆశయంతో పనిచేయాలన్నారు. కాదని ఇలాంటి వారికి సీటు ఇచ్చి పార్టీ సిద్ధాంతాన్ని పక్కదారి పట్టించాలంటే కూడా సీట్లు ఇవ్వొచ్చని.. తాను ఢీల్లి స్థాయి నాయకుడిని అని.. తన సేవలు పార్టీ కావాలంటే వాడుకోవచ్చన్నారు.

Also Read: Mukarram Jah: నిజాం కుటుంబంలో విషాదం.. ఎనిమిదో నిజాం మృతి

తాను ఎంపీ అయితేనే ఈ స్థాయికి రాలేదన్నారు. తనకు ఒక బ్రాండ్ ఉందని.. ఎంపీ కాకపోతే టాటా ట్రస్ట్ లాంటివి తెచ్చి సేవ చేస్తానేమోనని తెలిపారు. కేశినేని చిన్ని కి పార్టీ లో సీటు ఇస్తే చచ్చిన ముద్దతు ఇవ్వనని నాని తేల్చి చెప్పారు. క్యారెక్టర్ ఉన్న పేదవాడికైనా సిటు ఇస్తే ఎంపీనే కాదు ఏదైనా చేస్తానని. కానీ చీటర్స్, లాండ్ మాఫీయా డాన్ లకి, రియల్ ఎస్టేట్, మోసాలు చేసే వారికి, పేకాట క్లబ్ లు నడిపే వాళ్ళ కి తాను మద్దతు ఇవ్వనని కేశినేని నాని అన్నారు

  Last Updated: 15 Jan 2023, 09:40 PM IST