AP Elections : ఏపీలో నేతల కష్టాలు అన్ని ఇన్ని కావు..

మహిళలైతే భోజనం పెట్టి రోజుకు రూ.700 నుండి రూ.1000 అడుగుతున్నారు. ఆలా ఇస్తేనే వస్తాం అంటూ తెగేసి చెపుతున్నారు

  • Written By:
  • Publish Date - April 24, 2024 / 12:26 PM IST

ఎన్నికలు (Elections) వస్తున్నాయంటే చాలు రాజకీయ పార్టీల నేతలు (Political Parties Leaders)) కోట్ల డబ్బులు (Money) రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఒకప్పుడు ఎన్నికలు వేరు ఇప్పుడు వేరు..ఇప్పుడంత ఎన్నికలను డబ్బే నడిపిస్తుంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గరి నుండి పోలింగ్ పూర్తి అయ్యే వరకు ప్రతి రోజు డబ్బులు వెదజల్లిల్సిందే. ఇక ప్రస్తుతం ఏపీలో ఎన్నికల (AP Elections) వేడి సమ్మర్ ను మించి ఉంది. అధికార – ప్రతిపక్ష నేతలు ఎక్కడ తగ్గడం లేదు. పోటాపోటీగా ప్రచారం చేస్తూ..డబ్బును తెగ ఖర్చు చేస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ నేతలైతే ఇంకాస్త ఎక్కువగానే ఖర్చు చేస్తున్నారు. ఏ ఫ్లాట్ ఫామ్ ను వదిలిపెట్టకుండా ఖర్చు చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

వీరి ఖర్చు చూసిన ప్రజలు సైతం రోజు రోజుకు డిమాండ్ పెంచుతున్నారు. ర్యాలీ లో పాల్గొనాలన్న..ఏ పార్టీ జెండా మోయాలన్న..నేతల వెంట తిరగాలన్న భారీగా డబ్బు డిమాండ్ చేస్తున్నారు. మహిళలైతే భోజనం పెట్టి రోజుకు రూ.700 నుండి రూ.1000 అడుగుతున్నారు. ఆలా ఇస్తేనే వస్తాం అంటూ తెగేసి చెపుతున్నారు. ఇక మగవారైతే రోజుకు వెయ్యి రూపాయిలు , భోజనం , మద్యం డిమాండ్ చేస్తున్నారు. కాస్త అభ్యర్థిగా డబ్బున్న వాడైతే ఇంకాస్త ఎక్కువే డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ నేతలు ఎక్కడ తగ్గడం లేదు. వారు అడిగినంత ఇస్తున్నారు. మరికొంతమంది మాత్రం వీరి డిమాండ్ చూసి వామ్మో అనుకుంటున్నారు. అంత ఎందుకని అడిగితే ఎండలు మండిపోతున్నాయి..ఎండకు తిరగాలంటే అంత ఇవ్వాల్సిందే అంటున్నారు. ఇక చేసేది లేక చాలామంది నేతలు తమ బలం నిరూపించుకోవాలంటే జనాలు ఎక్కువగా ఉండాల్సిందే అని చెప్పి వారు ఎంత అడిగితే అంత ఇస్తూ వారి చుట్టూ తిప్పుకుంటున్నారు.

Read Also : World Leader : అగ్రరాజ్యంగా మేం కాకుంటే ఇంకెవరు ఉంటారు ? : బైడెన్