వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Jagan) తాడేపల్లి నివాసం వద్ద మరోసారి భద్రతా లోపం (Security flaw) వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు నలుపురంగు కారులో వచ్చి ఆయన ఇంటి ముందు ఒక వస్తువును విసిరి వెళ్లిపోయారు. శనివారం సాయంత్రం 4:32 గంటల సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. ఇది ఇటీవల కాలంలో జగన్ ఇంటి వద్ద జరుగుతున్న నాల్గవ భద్రతా లోపం కావడం పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది.
Iran-israel : ఇరాన్ ప్రెసిడెంట్ కు ప్రధాని మోదీ ఫోన్
ఇంతకు ముందు కూడా జగన్ ఇంటి వద్ద అగ్నిప్రమాదం, బీజేపీ యువమోర్చా నేతల దాడి, టీడీపీ కార్యకర్తల హల్‌చల్ వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. గతంలో శ్రీలక్ష్మీ నారాయణ కాలనీలో జగన్ నివాసానికి ఆనుకుని ఉన్న ప్రాంతంలో మంటలు చెలరేగగా, సెక్యూరిటీ సిబ్బంది సమయస్ఫూర్తితో మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. అలాగే, బీజేవైఎం నేతలు శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ విషయంలో జగన్‌ను విమర్శిస్తూ ఆయన ఇంటి వద్దకు వచ్చి గేటు దగ్గర హంగామా చేశారు. ఈ క్రమంలో సెక్యూరిటీ సిబ్బందికి తీవ్ర ఒత్తిడి ఏర్పడింది.
జగన్ ఇంటి వద్ద జరుగుతున్న సంఘటనలపై వైఎస్సార్సీపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నదేమంటే, ఇలా వరుస ఘటనలు జరుగుతుండటమే కాకుండా, అవి సాంకేతిక ఆధారాలు ఉండీ భద్రతా వ్యవస్థ స్పందించకపోవడం శోచనీయమని భావిస్తున్నారు. ప్రభుత్వం మారిన తరువాత రాజకీయ ప్రతీకారమేనన్న ఆరోపణలు వైసీపీ శ్రేణులు చేస్తున్నారు. ప్రతిపక్ష నేత అయిన జగన్‌కి పక్కా భద్రత లభించాల్సిన తరుణంలో ఇలా పదే పదే భద్రతా లోపాలు వెలుగుచూడటం దురదృష్టకరమని నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అధికార యంత్రాంగం ఈ విషయాన్ని తక్షణమే గమనించి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.