Site icon HashtagU Telugu

CBN Security : సీఎం చంద్రబాబు సెక్యూరిటీలో మార్పులు..ఎందుకో..?

Cbn Security

Cbn Security

సీఎం చంద్రబాబు సెక్యూరిటీ(Chandrababu Security )లో మార్పులు చోటుచేసుకున్నాయి. భద్రతాపరంగా కౌంటర్ యాక్షన్ టీమ్ (Counter Action Team) ను రంగంలోకి దిగింది. ఎన్‌ఎస్‌జీ బ్లాక్ క్యాట్ కమాండోలు, ఎస్‌ఎస్‌జీ సిబ్బందితో పాటు ఇప్పుడు ఆరుగురు కౌంటర్ యాక్షన్ కమాండోలు (National Security Guard (NSG), Special Security Group (SSG), and local armed forces) ప్రత్యేక రక్షణగా ఉంటారు. ఈ మార్పులు చంద్రబాబుకు ముప్పు ఉందనే హెచ్చరికల నేపథ్యంలో ఈ మార్పులు చేసినట్లు తెలుస్తుంది.

 

Drug Mafia : డ్ర‌గ్ మాఫియాతో ఎన్టీఆర్ కు సంబంధం..?

ప్రస్తుతం సీఎం చంద్రబాబుకు మూడంచెల భద్రత ఉంది. ఎన్‌ఎస్‌జీ కమాండోలు మొదటి వలయంగా, ఎస్‌ఎస్‌జీ రెండవ వలయంగా, స్థానిక పోలీసు సాయుధ బలగాలు మూడవ వలయంగా భద్రతను కల్పిస్తాయి. తాజా మార్పుల ద్వారా కౌంటర్ యాక్షన్ టీమ్ ప్రత్యేకంగా బయటి దాడుల్ని ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషించనుంది. కౌంటర్ యాక్షన్ టీమ్ సభ్యులకు ప్రత్యేకంగా ఎస్పీజీ శిక్షణ ఇచ్చింది. ఈ టీమ్ సభ్యులు నలుపు రంగు చొక్కా, గోధుమ రంగు ప్యాంటు ధరిస్తారు. వీరి షర్టుపై “ఎస్‌ఎస్‌జీ” అని రాసి ఉంటుంది. అత్యంత సమర్థమైన ఈ కమాండోలు అత్యవసర పరిస్థితుల్లో దాడులను ఎదుర్కొని చంద్రబాబును సురక్షితంగా ఉంచేందుకు సిద్ధంగా ఉంటారు. అలిపిరి బ్లాస్ట్ ఘటన తర్వాత చంద్రబాబుకు ఎన్ఎస్‌జీ భద్రత కల్పించారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కొన్ని దాడి ప్రయత్నాల తర్వాత భద్రతా మోహరింపు మరింత పెరిగింది. తాజా పరిణామాలు చంద్రబాబు భద్రతకు మరింత బలాన్ని చేకూరుస్తాయని భావిస్తున్నారు.

చంద్రబాబు భద్రత విషయంలో గతంలో ప్రత్యేక సూచనలు చేశారు. భద్రత పేరుతో ప్రజల నుంచి దూరం చేయొద్దని కోరారు. ఈ నేపథ్యంలో ప్రజలతో సన్నిహితంగా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, భద్రతా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేశారు.