తిరుమల తిరుపతి దేవస్థానం.. ప్రపంచంలోనే ప్రముఖ ఆలయాల్లో ఒకటి. అలాంటి ప్రతిష్టాత్మకమైన ఆలయంలో తరచుగా భద్రత లోపాలు బయటపడుతున్నాయి. తాజాగా తిరుమల ఆలయంలోకి గుర్తుతెలియని భక్తుడు మొబైల్ ఫోన్‌తో ‘ఆనంద నిలయం’, ఇతర లోపలి ఆవరణలను వీడియో తీయడంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) విచారణకు ఆదేశించింది. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు నిషేధించబడిన కొండ ఆలయంలో భద్రతా లోపాలను ఈ సంఘటన బహిర్గతం చేసింది.
టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ తనిఖీలను తనిఖీలను దాటుకొని భక్తుడు ఎలా దాటగలిగాడనేది మిస్టరీగా మారిపోయింది. ఒక నిమిషం నిడివిగల వీడియో పలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. ఆదివారం రాత్రి ఈ వీడియో రికార్డయినట్లు టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం గుర్తించింది.
ఈ వీడియోలో ‘ఆనంద నిలయం’ ద్రుశ్యాలు, తిరుమల ఆలయం లోపలి ఆవరణలు చాలా దగ్గర నుండి కనిపిస్తాయి. అయితే 24 గంటలు సీసీటీవీతో పాటు నిఘా బృందాలు ఉన్నా భక్తుడ్ని గుర్తించలేకపోవడం గమనార్హం. తిరుమలలోని ఐకానిక్ లార్డ్ వెంకటేశ్వర ఆలయం దేశంలోని భారీ కాపలాతో కూడిన దేవాలయాలలో ఒకటి. కొండ ఆలయ వ్యవహారాలను నిర్వహించే టీటీడీ తన భద్రత కోసం ఏటా రూ.300 కోట్లు వెచ్చిస్తోంది.
సెల్ ఫోన్‌తో తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రవేశించిన భక్తుడు
తిరుమలలో మరోసారి బయట పడిన భద్రత వైపాల్యం
ఆలయంలో ఆనంద నిలయంను సెల్ ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టిన భక్తుడు#Tirumala #TirumalaCellPhone #Tirupati pic.twitter.com/LW552Fs4pn
— Telugu Scribe (@TeluguScribe) May 8, 2023
Also Read: Blast at Golden Temple: గోల్డెన్ టెంపుల్ దగ్గర మరో పేలుడు, ఒకరికి గాయాలు!