Kuppam Alert : చంద్ర‌బాబుకు భ‌ద్ర‌త పెంపు, కుప్పంలో డే 3 హై అలెర్ట్‌

టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు భ‌ద్ర‌త‌పై ఎన్ ఎస్ జీ ప్ర‌త్యేకంగా దృష్టి సారించింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్కో షిఫ్ట్ కు ఉన్న 6+6 క‌మాండోల సంఖ్య‌ను 12+12 క‌మాండోలకు మార్చేసింది.

  • Written By:
  • Publish Date - August 26, 2022 / 11:03 AM IST

టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు భ‌ద్ర‌త‌పై ఎన్ ఎస్ జీ ప్ర‌త్యేకంగా దృష్టి సారించింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్కో షిఫ్ట్ కు ఉన్న 6+6 క‌మాండోల సంఖ్య‌ను 12+12 క‌మాండోలకు మార్చేసింది. ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌ను డీఎస్సీ స్థాయి అధికారి ఇప్ప‌టి వ‌ర‌కు చూశారు. ఇక నుంచి డీఐజీ స్థాయి అధికారి ప‌ర్య‌వేక్షించాల‌ని ఎన్ ఎస్ జీ నిర్ణ‌యం తీసుకుంది. నిఘా వ‌ర్గాల నుంచి వ‌చ్చిన రిపోర్ట్ మేర‌కు భ‌ద్ర‌త‌ను పెంచిన‌ట్టు తెలుస్తోంది.

మూడో రోజు కుప్పం ప‌ర్య‌ట‌న‌లో ఉన్న చంద్ర‌బాబు భ‌ద్ర‌త కోసం భారీగా పోలీసులు మోహ‌రించారు. మోడ‌ల్ కాల‌నీ కేంద్రంగా రోడ్ షో ను నిర్వ‌హిస్తారు. ఆ సంద‌ర్భంగా పోలీసులు అణువ‌ణువు త‌నిఖీల‌ను నిర్వ‌హించారు. కుప్పం అంతటా టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఆయ‌న మూడు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం కుప్పం వెళ్లారు. ఆ సంద‌ర్భంగా తొలి రోజు చంద్ర‌బాబు స‌భ‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నం వైసీపీ క్యాడ‌ర్ చేసింది. ఆ సంద‌ర్భంగా టీడీపీ, వైసీపీ శ్రేణులు ప‌ర‌స్ప‌రం రాళ్లు రువ్వుకున్నారు. ఆ సంద‌ర్భంగా టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు గాయాలు కావ‌డంతో చంద్ర‌బాబు ఆగ్ర‌హించారు. రెండో రోజు మ‌రింత రెచ్చిపోయిన వైసీపీ క్యాడ‌ర్ అన్న క్యాంటిన్ ను ధ్వంసం చేశారు.

ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నుంచి ధ్వంసం చేసిన అన్న క్యాంటిన్ వ‌ర‌కు చంద్ర‌బాబు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు. అంతేకాదు, క్యాంటిన వ‌ద్దే రోడ్డుపై భైఠాయించి నిర‌స‌న తెలిపారు. దీంతో అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణ నెల‌కొంది. రెండో రోజు మొత్తం ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కు ఉద్రిక్త వాతావ‌ర‌ణం మ‌ధ్య చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న సాగింది. కొంద‌రు వైసీపీ కార్య‌క‌ర్త‌లు రాత్రి టీడీపీకి చెందిన వాళ్ల ఇళ్ల‌పై దాడికి దిగారు. దీంతో మూడో రోజు హై టెన్ష‌న్ నెల‌కొంది. చంద్ర‌బాబు మీద దాడి చేసే అవ‌కాశం ఉంద‌ని గ్ర‌హించిన ఎన్ఎస్సీ జీ అప్ర‌మ‌త్తం అయింది. భ‌ద్ర‌త‌ను పెంచింది.

మూడో రోజు చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న రోడ్ షోతో ప్రారంభం కానుంది. పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చిన క్యాడ‌ర్ న‌డుమ రోడ్ షో కు చంద్ర‌బాబు సిద్ధం అయ్యారు. ఆ క్ర‌మంలో పోలీసులు భారీ సంఖ్య‌లో మోహ‌రించారు. ఇంకో వైపు టీడీపీ కార్య‌క‌ర్త‌లు కొందర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ల మీద కేసులు పెట్టారు. అంతేకాదు, వాళ్ల మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు న‌మోదు చేయ‌డంతో చంద్ర‌బాబు ఆగ్ర‌హిస్తున్నారు. మొత్తం మీద చంద్ర‌బాబుకు ప్రాణ‌హాని ఉంద‌ని అప్ర‌మ‌త్తం అయిన ఎన్ ఎస్సీజీ కుప్పం ప‌ర్య‌ట‌నపై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టింది.