Vande Bharat: విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వచ్చే రైల్వే ప్రయాణికులకు రైల్వే అధికారులు ఓ షాకింగ్ న్యూస్ చెప్పారు. ఇకపై ఈ రూట్‌లో నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat) డిసెంబర్ 10 నుంచి ప్రతి మంగళవారం వారపు సెలవుదినంగా ప్రకటించారు. అంటే ఈ ట్రైన్ డిసెంబర్ 10 నుంచి మంగళవారం అందుబాటులో ఉండదు. ఈ మేరకు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
ఈస్ట్ కోస్ట్ రైల్వే రైలు నం. 20833 / 20834 విశాఖపట్నం – సికింద్రాబాద్ – విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఆపరేటింగ్ షెడ్యూల్‌కు సవరణలను ప్రకటించింది. ఈ మార్పులు శనివారం ఆగస్ట్ 10, 2024 నుండి అమలులోకి వస్తాయి. ఈ రూట్‌కి వారపు సెలవు దినాన్ని ఆదివారం నుండి మంగళవారానికి మార్చినట్లు అధికారులు ప్రకటించారు. విశాఖపట్నం- సికింద్రాబాద్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణాన్ని ప్లాన్ చేసేటప్పుడు ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలని సూచించారు.
Also Read: Startup Registration : స్టార్టప్‌ను రిజిస్టర్ చేసుకోవాలా ? ఆన్‌లైన్‌లో చాలా ఈజీ ప్రాసెస్
విశాఖపట్నం – సికింద్రాబాద్ – విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్‌ను సర్వీసు రోజుల మార్పుతో సవరించారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే శుక్రవారం రైలు నం. 20833 / 20834 విశాఖపట్నం – సికింద్రాబాద్ – విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను డిసెంబర్ 10 నుండి అమలు చేసే రోజులను సవరించింది. అంటే ఈ మార్పు డిసెంబర్ 10 నుంచి అమలు చేయనున్నారు. అయితే ఈ రైలు ద్వారా నిత్యం వందలాది మంది ప్రయాణికులు సికింద్రాబాద్ టూ విశాఖపట్నం ప్రయాణిస్తూ ఉంటారు. అయితే ఈ మార్పుకు గల కారణాలను అధికారులు వెల్లడించలేదు.
We’re now on WhatsApp. Click to Join.
అప్డేట్ చేసిన షెడ్యూల్ వివరాలు
విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ (ట్రైన్ నెం. 20834)
- మునుపటి షెడ్యూల్: వారానికి 6 రోజులు (ఆదివారం మినహా)
- కొత్త షెడ్యూల్: వారానికి 6 రోజులు (మంగళవారం మినహా)
- సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం (ట్రైన్ నెం. 20833)
- మునుపటి షెడ్యూల్: 6 రోజులు ఒక వారం (ఆదివారం మినహా)
- కొత్త షెడ్యూల్: వారానికి 6 రోజులు (మంగళవారం మినహా)