Election Counting : ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్..

కేంద్ర, ఏపీఎస్పీ, సీఏపీఎఫ్, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు బలగాలు సమస్యాత్మక ప్రాంతాలన్నింటినీ తమ అధీనంలోకి తీసుకున్నాయి

Published By: HashtagU Telugu Desk

మూడు నెలల ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది. ఏపీలో ఎవరు విజయం సాదించబోతున్నారనేది తెలుస్తుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. దీంతో రాష్ట్రంలో ఎటు చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. కేంద్ర, ఏపీఎస్పీ, సీఏపీఎఫ్, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు బలగాలు సమస్యాత్మక ప్రాంతాలన్నింటినీ తమ అధీనంలోకి తీసుకున్నాయి. 144 సెక్షన్తో ఆయా జిల్లాల ఎస్పీలు భద్రతను కట్టుదిట్టం చేశారు. మాచర్ల, తాడిపత్రి, పిఠాపురం, తిరుపతి వంటి ప్రాంతాలను పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. కౌంటింగ్ రోజున అల్లర్లు, గొడవలకు పాల్పడితే జైలుకు పంపుతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ముఖ్యమ్గా పల్నాడు జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాలైన మాచర్ల, గురజాల, నరసరావుపేట సహా వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల్లో ఎస్పీ మలికాగార్గ్ ప్రత్యేక బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికల కోడ్ సహా 144 సెక్షన్ అమలులో ఉన్న నేపథ్యంలో ప్రజలు ఎలాంటి అల్లర్లు, దాడులకు పాల్పడ్డవద్దని హెచ్చరించారు. 5వ తేదీ ఉదయం వరకు షాప్స్ మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఇప్పటికే నాకాబందీ పేరిట జిల్లాలోని 34 స్టేషన్ల పరిధిలో పోలీస్‌ బలగాలతో వాహనాలు, అనుమానాస్పద ప్రాంతాల్లో క్షుణంగా తనిఖీలు నిర్వహించారు. 465 బైక్‌లు, 6 ఆటోలు, 3 కార్లు సీజ్ చేశారు. లాడ్జీలు, కల్యాణ మండపాలు, వసతి గృహాల్లో సోదాలు చేశారు.

Read Also : Phones Vs Wallets : స్మార్ట్‌ఫోన్ బ్యాక్ కవర్‌లో ఆ కార్డులు ఉంచుతున్నారా ?.. బీ కేర్ ఫుల్!

  Last Updated: 03 Jun 2024, 10:20 AM IST