AP Secretariat : సచివాలయాన్ని తాకట్టు పెట్టలేదు – CRDA

  • Written By:
  • Publish Date - March 3, 2024 / 08:50 PM IST

సీఎం జగన్ (CM Jagan) రాష్ట్ర సచివాలయాన్ని (AP Secretariat) రూ.370 కోట్లకు తాకట్టు పెట్టారంటూ ఉదయం నుండి టీడీపీ (TDP) పెద్ద ఎత్తున ఆరోపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అడ్డగోలుగా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన జగన్..చివరికి రాష్ట్ర సచివాలయాన్నే తాకట్టుకు రాసిచ్చి రూ.370 కోట్ల అప్పు తెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధాని నిర్మాణంలో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన భవన సముదాయాన్ని కూడా అప్పుల కోసం వాడుకున్నారు. రాష్ట్ర బడ్జెట్‌ రూ.2.86 లక్షల కోట్లు. కానీ, కేవలం రూ.370 కోట్ల కోసం తాకట్టు పెట్టారని మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఈ వార్తలపై CRDA స్పందించింది.

We’re now on WhatsApp. Click to Join.

సీఎం జగన్ సచివాలయం తాకట్టు పెట్టి బ్యాంకు నుంచి రుణం పొందారన్న వార్తలను CRDA ఖండించింది. ‘ఇదంతా పూర్తి అవాస్తవం అని, సాధారణ పరిపాలన శాఖ నుంచి దీనిపై మాకు ఎలాంటి ప్రతిపాదన రాలేదు. కన్సార్టియం బ్యాంకులు, హడ్కోల నుంచి CRDA పొందిన రుణం మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించాం. సచివాలయం తాకట్టు పెట్టినట్లు వచ్చిన వార్త అవాస్తవం. దీనిపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తాం’ అని హెచ్చరించింది.

రాయపూడిలోని అఖిల భారత సర్వీసు అధికారుల క్వార్టర్స్ జీవోఎంఎస్ నెంబరు: 332, తేదీ: 15.10.2018 ప్రకారం 2,060 కోట్ల రూపాయల రుణాన్ని కనార్టియం బ్యాంకులు అయినటువంటి (యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా, బ్యాంకు ఆఫ్ బరోడా మరియు ఇండియన్ బ్యాంకులు) మంజూరు చేశాయి. ఇందులో రూ.1,955 కోట్లు మాత్రమే ఇప్పటి వరకు సీఆర్డీకు రిలీజ్ చేయటం జరిగింది. 2017వ సంవత్సరంలో హడ్కో రూ.1275 కోట్లను మౌలిక సదుపాయాల కొరకు రుణాన్ని మంజూరు చేసింది.

అందులో రూ.1,151 కోట్లు మాత్రమే సీఆర్డీఏకు రిలీజ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కంఫర్ట్ లెటర్ జారీ చేసింది. ఏపీ సీఆర్డీఏ సచివాలయ భవనాలను తాకట్టు పెట్టి ఎటువంటి రుణమూ పొందలేదు. ఇటువంటి నిరాధారమైన కథనాన్ని ప్రచురించటంపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.

Read Also : Gujarat Titans Player Robin Minz : యువ వికెట్ కీపర్ కు యాక్సిడెంట్