Chalo Vijawada : ‘చ‌లో విజ‌య‌వాడ’ స‌క్సెస్ గుట్టుర‌ట్టు

`చ‌లో విజ‌య‌వాడ‌`బండారం బ‌య‌ట ప‌డ‌బోతోంది. పీఆర్సీ సాధన స‌మితి అస‌లు నిజాల‌ను బ‌య‌పెట్ట‌డానికి సిద్ధం అవుతోంది.

  • Written By:
  • Publish Date - February 7, 2022 / 12:26 PM IST

`చ‌లో విజ‌య‌వాడ‌`బండారం బ‌య‌ట ప‌డ‌బోతోంది. పీఆర్సీ సాధన స‌మితి అస‌లు నిజాల‌ను బ‌య‌పెట్ట‌డానికి సిద్ధం అవుతోంది. ఉపాధ్యాయ సంఘాల వెనుక బిగ్ బాస్ ఎవ‌రో ఉన్నారు. ఆ బిగ్ బాస్ పేరును బ‌య‌ట‌పెడ‌తామ‌ని ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘం హెచ్చ‌రిస్తోంది. మూడు రోజుల క్రితం ముగిసిన స‌మ్మె ప్ర‌కంప‌న రాజ‌కీయ కోణాన్ని తాకుతోంది. ఉద్యోగులు, ఉపాధ్యాయుల మ‌ధ్య బ‌హిరంగ వార్ కొన‌సాగుతోంది.కొత్త పీఆర్సీని ర‌ద్దు చేసే వ‌ర‌కు స‌మ్మె కొన‌సాగుతుంద‌ని పీఆర్సీ సాధన స‌మితి నోటీస్ ఇచ్చింది. ఆదివారం అర్థ‌రాత్రి నుంచి నోటీస్ ప్ర‌కారం స‌మ్మె కొన‌సాగాలి. కానీ, శుక్ర‌వారం, శ‌నివారం మంత్రుల క‌మిటీతో జ‌రిగిన చ‌ర్చ‌ల ఫ‌లించ‌డంతో సాధ‌న స‌మితి స‌మ్మెను విరమించింది. హెచ్ ఆర్ ఏ శ్లాబులను మార్పు చేయ‌డం, ప్ర‌తి ఐదేళ్ల‌కు ఒక‌సారి పీఆర్సీని రివ్యూ చేయ‌డం, ఐఆర్ రిక‌వ‌రీ లేకుండా చేయ‌డం..త‌దిత‌ర డిమాండ్ల‌కు మంత్రుల క‌మిటీ ఓకే చెప్పింది. దీంతో సీఎం జ‌గ‌న్ నుంచి హామీ తీసుకున్న త‌రువాత స‌మ్మెను విరమిస్తూ స‌మితి నిర్ణ‌యం తీసుకుంది. ఆ టైంలో ఉపాధ్యాయ సంఘాల నేత‌ల కూడా అక్క‌డే ఉన్నారు. కానీ, స‌మ్మె విర‌మ‌ణ త‌రువాత టీచ‌ర్స్ నుంచి వ‌చ్చిన ఒత్తిడి మేర‌కు ఉపాధ్యాయ సంఘాలు ఆందోళ‌న కొన‌సాగుతుంద‌ని ప్ర‌క‌టించారు.

ఉపాధ్యాయులు ఆందోళ‌న కొన‌సాగించాలి అనుకుంటున్నారు. ఆ మేర‌కు ఏపీ టీచ‌ర్స్ ఫెడ‌రేష‌న్ దూకుడుగా వెళుతోంది. చ‌లో విజ‌య‌వాడ విజ‌య‌వంతం కేవ‌లం టీచ‌ర్స్ మాత్ర‌మే చేశార‌ని ఫెడ‌రేష‌న్ భావ‌న‌. ప్ర‌భుత్వ ప్ర‌లోభాల‌కు స్టీరింగ్ క‌మిటీ నేత‌లు లొంగిపోయార‌ని ఆరోప‌ణ‌ల‌కు దిగుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఉపాధ్యాయుల హెచ్ ఆర్ ఏ పెర‌గ‌లేదు. కేవ‌లం స‌చివాల‌య ఉద్యోగుల హెచ్ ఆర్ ఏ , ఇత‌ర ప్ర‌భుత్వం ఉద్యోగుల హెడ్ ల‌కు మేలు జ‌రిగేలా ప్ర‌భుత్వంతో కుమ్మ‌క్కు అయ్యార‌ని టీచ‌ర్స్ మండిప‌డుతున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా చీకటీ ఒప్పందం జ‌రిగింద‌ని ట్రోల్స్ చేస్తున్నారు. చ‌లో విజ‌య‌వాడ‌ను విజ‌య‌వంతం చేసిన హీరోలుగా టీచ‌ర్స్ భావిస్తున్నారు.
స‌మ్మెలో ఉపాధ్యాయు పాత్ర మాత్ర‌మే ఉన‌ట్టు బిల్డ‌ప్ ఇస్తున్నార‌ని ప్ర‌భుత్వ ఉద్యోగుల సంగం రాష్ట్ర అధ్యక్షుడు సూర్య‌నారాయ‌ణ వాళ్ల‌పై ఫైర్ అవుతున్నాడు. హీరోయిజం కోసం ఉపాధ్యాయ సంఘాలు ప్ర‌య‌త్నిస్తే తాము ఏమీ చేయ‌లేమ‌ని డైరెక్ట్ అటాక్ చేశాడు. చ‌లో విజ‌య‌వాడ ఛాంపియ‌న్లుగా టీచ‌ర్స్ భావించ‌డాన్ని మానుకోవాల‌ని హిత‌వు ప‌లికాడు. ఉపాధ్యాయుల వెనుక ఎవ‌రున్నారో..తెలుసంటూ చుర‌క‌లు వేశాడు. ఓవ‌రాక్ష‌న్ చేస్తే మొత్తం బండారం బ‌య‌ట‌పెడ‌తానంటూ సూర్య‌నారాయ‌ణ హెచ్చ‌రించ‌డం చూస్తే..చ‌లో విజ‌య‌వాడ వెనుక ఏం జ‌రిగిందో త్వ‌ర‌లోనే బ‌య‌ట‌కు రానుంది.విప‌క్ష పార్టీలు ప్రోద్భ‌లం చ‌లో విజ‌య‌వాడ వెనుక ఉంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. రాజ‌కీయ పార్టీల‌కు అతీతంగా పీఆర్సీ సాధ‌న స‌మితి ప‌నిచేస్తుంద‌ని ప్ర‌క‌టించారు. కానీ, ఇప్పుడు స‌మితి నిలువుని చీలిపోవ‌డంతో పాటు శ‌త్రువులుగా మార‌డంతో విప‌క్షాల పాత్ర ఎక్క‌డెక్క‌డ ఉందో బయ‌ట‌కు రానుంది. ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాల ముసుగులో రాజ‌కీయ పార్టీల‌కు కొమ్ముకాస్తున్న బండారం మొత్తం బ‌య‌ట‌కు రానుంది. మొత్తం మీద చ‌లో విజ‌య‌వాడ విజ‌యం వెనుక వెన్నుపోటు పాలిట్రిక్స్ ఎలా న‌డిచాయో..ఉద్యోగ‌, ఉపాధ్యాయ సంఘాల నేత‌ల నుంచి తెలుసుకోవ‌డానికి ప‌లువురు ఆస‌క్తిగా ఉన్నారు.