Site icon HashtagU Telugu

AP : సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందే ఏపీలో పేద‌లంద‌రికి ఇళ్లు.. రెండో విడ‌త‌లో ఇళ్ల నిర్మాణం పంపిణీకి స‌న్నాహాలు

CM YS Jagan Birthday

Cm Ys Jagan

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్ర‌భుత్వం దూకుడు పెంచింది. ముఖ్యమంత్రి వై.ఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు-పెదలందరికి ఇల్లు పథకం కింద ఐదు లక్షల ఇళ్లను త్వరగా పూర్తి చేసి ఎన్నికలకు ముందు లబ్ధిదారులకు అందజేయడంపై జగన్ మోహన్ రెడ్డి దృష్టి సారించారు. మొదటి విడతలో 7.50 లక్షల ఇళ్లను అప్పగించిన ఆయన ఇప్పుడు రెండో విడతలో ఐదు లక్షల ఇళ్లను పంపిణీ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. తెలంగాణలోని ఇటీవల ఎన్నికల ఫలితాలు, అక్కడ కాంగ్రెస్ పార్టీ బీఆర్‌ఎస్‌ను గద్దె దించగా, అంతకుముందు కర్ణాటకలో, ఎన్నిల్లోనూ కాంగ్రెస్ విజ‌యంసాధించ‌డంతో ఏపీలో కూడా ప‌రిణామాలు మారుతాయ‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో అధికార వైసీపీ అప్ర‌మ‌త్త‌మైంది. 2024 ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ గెలిచేందుకు జగన్ మోహన్ రెడ్డి రకరకాల వ్యూహాలు రచించారు. మెగా గృహనిర్మాణ కార్యక్రమం ద్వారా అంద‌రికి ఇల్లు ఇచ్చి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని ఏపీ సీఎం జ‌గ‌న్ భావిస్తున్నారు. ఆ దిశగానే ఏపీ ప్ర‌భుత్వం అడుగులు వేస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉండగా 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు తన ఎన్నికల వాగ్దానాలను చాలా వరకు అమలు చేయలేదని, ఫలితంగా ఆయన గద్దె దిగారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ధోరణిని గమనించిన జగన్ మోహన్ రెడ్డి మహమ్మారి కాలంలో సహా నవరత్నాలు సంక్షేమ పథకాలను అమలు చేయడం ప్రారంభించారు. రెండు దశల మెగా హౌసింగ్ ప్రోగ్రామ్‌లో ఒక్కో దశలో 16 లక్షల ఇళ్లను పూర్తి చేసి పంపిణీ చేస్తారు. గృహనిర్మాణ కార్యక్రమం పురోగతిని తరచుగా సీఎం జ‌గ‌న్ సమీక్షిస్తున్నారు. ఇది రాబోయే రెండు నెలల్లో పూర్తయితే వైఎస్‌ఆర్‌సికి కాస్త అనుకూలంగా ఉండే అవ‌కాశం ఉంది. ఐదు లక్షల ఇళ్లలో 1,15,334 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మ‌రో 3,84,666 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. నెల్లూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, విశాఖపట్నం, చిత్తూరు, తిరుపతి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో ఇళ్ల నిర్మాణం శరవేగంగా సాగుతున్నాయి. చాలా వరకు మహిళల పేరు మీద ఉన్న ఇళ్లు కాబట్టి వారి ఓట్లతో గెలుపొందాలంటే ఆ ఇళ్లను పూర్తి చేయడం తప్పనిసరి అని సీనియర్ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మెగా హౌసింగ్ ప్రోగ్రామ్ వచ్చే ఏడాది ‘బిగ్ బ్యాటిల్’పై భారీగా ప్రభావం చూపుతుందని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు.

Also Read:  Andhra Pradesh : కొవ్వూరులో రైలు స్టాపేజ్‌లను పునరుద్ధరించాలని కేంద్ర మంత్రిని కోరిన ఏపీ హోంమంత్రి వ‌నిత‌