వాయుగుండం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడిన సంగతి తెలిసిందే. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అనేక జిల్లాలో ఒకే రోజు దాదాపు 42 సెం.మీ వర్షం పడడంతో జనజీవనం , రవాణా వ్యవస్థ అస్తవేస్తమైంది. ఎక్కడిక్కడే వాగులు , వంకలు , చెరువులు , నదులు , ప్రాజెక్టులు ఉప్పొంగి ప్రవహించడంతో రోడ్లు, రైల్వే ట్రాక్ లు తెగిపోయాయి. వేలాది ఎకరాల పంటపొలాలు నీటమునిగాయి. వందలాది ఇల్లు నేలమట్టం అవ్వడం , వరదలో కొట్టుకుపోవడం జరిగింది. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడం, వరద ప్రవాహం తగ్గడం జనాలు బయటకు వస్తూ తమ ఇళ్లకు చేరుకుంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇంతటి విపత్కర పరిస్థితిలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. వారి కష్టాలను క్యాష్ చేసుకోవడానికి కేటుగాళ్లు సిద్ధమయ్యారు. పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి వేలాది రూపాయలు వసూళ్లు చేస్తున్నారు. మరో పక్క వరద నీటిలో కొట్టుకుపోయిన వాహనాలను బయటకు తీసేందుకు కూడా భారీగా డబ్బు డిమాండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ, ఐతవరం వద్ద పదుల సంఖ్యలో టూ వీలర్స్ , కార్లు వరద బురదలో కూరుకుపోయాయి. వాటిని తీసేందుకు ప్రయివేటు వ్యక్తులను ఆశ్రయిస్తే.. ఒక్కో కారుకు బయటకు తీయడానికి 15 వేల రూపాయాల వరకూ వసూలు చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితిలో కార్లను వారడిగినంత డబ్బూ ఇచ్చి బయటకు తీసుకువస్తున్నారు యజమానులు. ఇలా అనేక చోట్ల వసూళ్లు చేస్తూ..దోచుకుంటున్నారు. ఇప్పటికే కష్టాల్లో ఉంటె..వీరు మరింత కష్టం తెస్తున్నారని బాధితులు వాపోతున్నారు.
Read Also : Japanese Man : 12 ఏళ్లుగారోజుకు 30 నిమిషాలు మాత్రమే నిద్ర పోతున్నాడట..