చంద్రబాబు అరెస్ట్ (Chandrababu arrest) కు నిరసన ఈరోజు టీడీపీ ‘సత్యమేవ జయతే’ (Satyameva Jayathe) దీక్షకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఏపీలోనే కాకుండా తెలంగాణ లోను టీడీపీ నేతలు ఈ దీక్షలో పాల్గొన్నారు. నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) రాజమండ్రిలోని క్వారీ సెంటర్ వద్ద భువనేశ్వరితో పాటు పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, శ్రేణులు, అభిమానులు దీక్షలో పాల్గొన్నారు. ముందుగా మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి భువనేశ్వరి నివాళులర్పించారు. ఆ తర్వాత దీక్షను ప్రారంభించారు.ఇక ఢిల్లీలో ఉన్న నారా లోకేష్ అక్కడే దీక్ష చేపట్టారు. ఇక మంగళగిరిలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీడీపీ ముఖ్యనేతలు దీక్ష చేస్తున్నారు. అలాగే ఏపీ వ్యాప్తంగా కూడా దీక్షలు చేపట్టారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేపట్టారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ సందర్భంగా భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ…‘‘ చంద్రబాబు (Chandrababu ) కోసమో.. మా కుటుంబం కోసమో కాదు.. రాష్ట్ర ప్రజల క్షేమం కోసమే ఈ సత్యాగ్రహ దీక్ష చేపట్టాం. మహాత్మాగాంధీ లాంటి వారికే జైలు జీవితం తప్పలేదు. ఏనాడు మా కుటుంబంపై అవినీతి ఆరోపణలు లేవు. మేం ఎప్పుడూ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు. మహాత్మాగాంధీ స్వాతంత్య్రం కోసం పోరాడి జైలుకి వెళ్లారు. ప్రజలకు సేవ చేయాడానికి చంద్రబాబు నిత్యం పరితపించారు. చంద్రబాబు నీతిగా బతికారు. మా తండ్రి ఎన్టీఆర్ నీతిగా బతకటం నేర్పారు. చంద్రబాబు జైలులో, లోకేష్ డిల్లీలో, నేను బ్రాహ్మణి రాజమండ్రిలో ఉన్నాం. ఇలాంటి రోజు మా కుటుంబానికి వస్తుందనే అనుకోలేదు. చంద్రబాబు ఎప్పుడూ పోలవరం, అమరావతి కోసమే ఆలోచించేవారు. ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు ఎన్నో కలలు కన్నారు. చంద్రబాబు మీద నమ్మకంతో హైదరాబాద్‌లో.. బిల్ క్లింటన్, బిల్ గేట్స్ పెట్టుబడులు పెట్టారు’’ అని భువనేశ్వరి చెప్పుకొచ్చారు. ఇక ఢిల్లీలో లోకేష్ చేపట్టిన సత్యమేవ జయతే దీక్షకు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణ రాజుతోపాటు ఢిల్లీలోని తెలుగు సంఘాలు, ఢిల్లీ యూనివర్సిటీ తెలుగు విద్యార్థులు, ఢిల్లీలోని తెలుగువారు మద్ధతు తెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్టును వారంతా ఖండించారు.
Read Also : Telangana Janasena : తెలంగాణ లో 32 స్థానాల్లో జనసేన పోటీ..నియోజకవర్గాల లిస్ట్ ఇదే