AP : సత్తెనపల్లి లో రోడ్డెక్కిన మహిళలు..ఓటుకు డబ్బులు ఇవ్వలేదంటూ ఆందోళన

సత్తెనపల్లిలో 18వ వార్డుకు చెందిన ఓటర్లు రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు. ఓటు వేసేందుకు ఇవ్వాల్సిన డబ్బులు..వైసీపీ నేతలు ఇవ్వకపోవడం వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

Published By: HashtagU Telugu Desk
Spl

Spl

ఓట్లు వస్తున్నాయంటే ఓటర్లుకు పండగే..ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గరి నుండి పోలింగ్ పూర్తి అయ్యేవరకు ఓటర్లను రాజకీయ నేతలు బంగారు కోడిపెట్టాలా చూసుకుంటారు. ఓటర్లు ఏది అడిగితే అది ఇవ్వాల్సిందే. అందుకే ఓట్లు వస్తున్నాయంటే ఓటర్లంతా సంబరాలు చేసుకుంటారు. ఇక డబ్బులిచ్చి ఓటు కొనుగోలు చేయడం అనేది ఎప్పుడు జరిగేది..మీ ఓటును అమ్ముకోవద్దు అంటూ ప్రతి ఒకరు చెపుతూనే ఉంటారు కానీ ఓటరు మాత్రం రాజకీయ నేతల వసూళ్లు తెలిసి వారి దగ్గరి నుండి తీసుకోవడం తప్పేమి కాదని అంటుంటారు. వారి జేబులో నుండి డబ్బులు ఏమి ఇవ్వడం లేదు కదా..మన దగ్గరి నుండి వసూళ్లు చేసిన డబ్బే..మళ్లీ మనకు ఇస్తున్నారని చెప్పి డిమాండ్ చేసి మరి వారి దగ్గరి నుండి వసూళ్లు చేస్తారు. ఇక ఇప్పుడు ఏపీలో కూడా అదే జరుగుతుంది. ఈసారి అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీ ఉండడంతో అధికార పార్టీ నేతల నుండి పెద్ద ఎత్తున ఓటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వకపోతే ధర్నాకు సైతం దిగుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా సత్తెనపల్లి లో అదే జరిగింది. సత్తెనపల్లిలో 18వ వార్డుకు చెందిన ఓటర్లు రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు. ఓటు వేసేందుకు ఇవ్వాల్సిన డబ్బులు..వైసీపీ నేతలు ఇవ్వకపోవడం వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు డబ్బులు ఇవ్వకపోయినా మధ్య వ్యక్తులు తమకు డబ్బు ఇచ్చినట్లు చెప్పి..ఆ డబ్బులు వారి జేబుల్లో వేసుకుంటున్నారని వారంతా వాపోతున్నారు. మాకు డబ్బులు ఇస్తేనే మీ పార్టీకి ఓటు వేస్తాం..లేకపోతే వేసేదే లేదంటూ తేల్చి చెపుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. ఇక్కడే కాదు పిఠాపురం లోను ఇదే పరిస్థితి నెలకొంది. తమకు డబ్బులు ఇవ్వలేదని చెప్పే..ఏకంగా వైసీపీ అభ్యర్థి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడి చేసారు .

Read Also : CM Revanth Reddy : ఫుట్‌బాల్‌‌ ప్లేయర్‌గా మారిన సీఎం రేవంత్ రెడ్డి

  Last Updated: 12 May 2024, 01:23 PM IST