Site icon HashtagU Telugu

AP Politics : ఆంధ్రప్రదేశ్ లో మాజీ డిప్యూటీ సీఎంకు రాజుల సవాల్.. కులదేవతపై ప్రమాణం చేస్తేనే క్లీన్ చిట్!

Satrucharla Sri Vani

Satrucharla Sri Vani

ఏపీలో శత్రుచర్ల కుటుంబంలో రాజకీయ విభేదాలు పెరిగాయి. మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి.. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అక్రమంగా ఆస్తులు సంపాదించారని ఆమె ఆడపడుచు శత్రుచర్ల పల్లవి రాజు ఆరోపించారు. ఆమె అలా సంపాదించలేదంటే.. తమ కులదేవతపై ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. దీంతో ఏపీలో పార్వతీపురం మన్యం జిల్లా రాజకీయాలు హీటెక్కాయి.

పుష్పశ్రీవాణి ఈమధ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను ఆదేశిస్తే.. కురుపాం పొలిమేరల్లోకి కూడా టీడీపీ నేతలు రాలేరని అన్నారు. కురుపాం నియోజకవర్గంలో రౌడీ రాజకీయాలకు చోటు లేదని.. అలాంటి వాటిని అడ్డుకుంటామని చెప్పారు. వైసీపీ ప్లీనరీ సందర్భంగా చేసిన ఈవ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పుష్పశ్రీవాణి చేసిన కామెంట్స్ పై ఫైరయ్యారు పల్లవిరాజు.

పుష్పశ్రీవాణి.. శత్రుచర్ల కుటుంబం నుంచే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని.. అయినా సరే తమ ఫ్యామిలీలోనే పాలిటిక్స్ ప్లే చేస్తున్నారని.. వివాదాలు సృష్టి అగ్గి రాజేస్తున్నారని పల్లవిరాజు అన్నారు. ఎమ్మెల్యే అయి మూడేళ్లయినా అభివృద్ధి పనులు చేయలేదని విమర్శించారు. పైగా దానిపై ఎవరు ప్రశ్నించినా సరే పోలీసు కేసులు పెట్టిస్తున్నారని.. ఇది ఎంతవరకు న్యాయమంటూ ప్రశ్నించారు.

త్వరలోనే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుని కలిసి.. పార్టీలో చేరడానికి పల్లవిరాజు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. పుష్పశ్రీవాణి అక్రమాలపై పోరాడడానికి ఆమె సమాయత్తమవుతున్నారు. ఈమధ్యకాలంలో ఉమ్మడి విజయనగరం జిల్లాలో సాగిన చంద్రబాబు పర్యటన గ్రాండ్ సక్సెస్ కావడంతో అక్కడి పొలిటికల్ సీన్ ఒక్కసారిగా మారింది.

Exit mobile version