ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి రాజకీయాలు జోరందుకున్నాయి. వరుసగా నేతల హడావిడి , ప్రచారం , సభలు , సమావేశాలు , వలసలు ఇలా రోజు రోజుకు అక్కడి రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ లో ఏంజరుగుతుందో అర్ధం కానీ పరిస్థితి. నేతలపై ప్రజల్లో ఉన్న అసంతృత్తి కారణంగా ఈసారి చాలామందికి టికెట్ ఇవ్వడం లేదు జగన్..ఈ క్రమంలో ఎవరికీ టికెట్ దక్కుతుందో..ఎవరికీ దక్కదో అర్ధం కానీ పరిస్థితి. ఈ తరుణంలో పలువురు ఎమ్మేల్యేలు ..పార్టీలో కీలక నేతలను కలుస్తూ..టికెట్ కోసం ట్రై చేస్తున్నారు. ఓ పక్క సజ్జల , మరోపక్క పెద్దిరెడ్డి వంటి సీనియర్లను ప్రతి రోజు వివిధ నియోజకవర్గాల వారు కలిసి టికెట్ గురించి ఆరా తీస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ క్రమంలో తాజాగా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం శనివారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసి కాళ్లకు నమస్కరించడం చర్చనీయాంశమైంది. నియోజకవర్గ అభివృద్ధి కోసమే మంత్రిని కలిసినట్లు పైకి చెప్పుకుంటున్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో సీటు విషయమై ప్రాధేయపడినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి కాళ్లు మొక్కిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెద్దిరెడ్డిని తిరుపతిలోని ఆయన నివాసంలో ఎమ్మెల్యే ఆదిమూలం కలిశారు. నియోజకవర్గ పరిధిలో పనులన్నీ మీరు చెప్పినట్లుగానే చేశానని, మరో సారి అవకాశం ఇవ్వాలని కోరినట్లు ప్రచారం సాగుతోంది.
మంత్రి పెద్దిరెడ్డితో ఎమ్మెల్యే ఆదిమూలం భేటిపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. వైసీపీలో దళితులకు ప్రాధాన్యత లేదని, గతంలో ఎంఎస్ బాబుకు అన్యాయం చేశారని, ఇప్పుడు మరో దళిత ఎమ్మెల్యేను సాగనంపడానికి సర్వేల పేరుతో కుట్రలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. వైసీపీలో దళితులకు మరో సారి అవకాశం రావాలంటే మంత్రుల కాళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Read Also : Cabinet Meeting : రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం..ప్రదం చర్చ వాటిపైనే..!!