AP Cockfights: సంక్రాంతికి రాజకీయ రంగు, 2000 కోట్లు కొల్లగొట్టిన కోడి పందాలు!

  • Written By:
  • Updated On - January 14, 2024 / 10:22 PM IST

AP Cockfights: ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి, కోస్తా ప్రాంతాలలో సంక్రాంతి పండుగ సందడి నెలకొంది. మూడు రోజుల పండుగ సందర్భంగా వేల కోట్లు అక్రమ కోడి పందాల రూపంలో కోట్లు డబ్బులు చేతులు మారుతున్నాయి. కుటుంబాలు గాలిపటాలు ఎగురవేయడానికి ఒకచోట సరాదాగా కోడి పందాలు ఆడటం ఏపీలో సహజంగా మారింది. కోడిపందాలు ఆంధ్ర ప్రదేశ్‌లోని అనేక గ్రామాలలో ప్రతిష్టాత్మకమైన సంప్రదాయం. ప్రధానమైన కల్చర్ కూడా.

సంక్రాంతి సంబరాల్లో అక్రమ కోడి పందేలను నిరోధించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవల పోలీసులను మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించినప్పటికీ ఈ పండుగ రోజున కూడా జోరుగా పందాలు జరిగాయి.  సంక్రాంతి కోడిపందాల మహోత్సవంలో కోట్లాది రూపాయల జూదం ఆడేందుకు వేలాది మంది ‘పంటర్లు’ ప్రేక్షకులతో జనవరి 14 ఆదివారం నాడు గోదావరి జిల్లాలు, ఆంధ్ర ప్రదేశ్‌లోని అనేక గ్రామాల్లో సందడి నెలకొంది

‘‘నేను హైదరాబాద్‌ సమీపంలోని శామీర్‌పేట గ్రామం నుంచి వచ్చాను. ప్రతి సంవత్సరం సంక్రాంతికి కోడిపందాలు చూసేందుకు భీమవరం వస్తాను. నా స్నేహితులు కొందరు జూదం ఆడుతున్నారు” అని తెలంగాణకు చెందిన 27 ఏళ్ల ఎం ప్రభు తెలిపారు. ఒక పెద్ద తెల్లటి గుడారం పక్కన ఉన్న సంక్రాంతి నేపథ్య సెల్ఫీ పాయింట్‌లో ప్రభు కోడి ఫొటోలతో పోజులిచ్చాడు. పదునైన కత్తులు కట్టుకున్న కోళ్లు క్రీడలో పోటీపడుతున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు కూడా.

ఇక ఈ పండుగకు రాజకీయ రంగు పులుముకుంది. స్థానిక అధికార పార్టీ నాయకులు పెద్ద ఫ్లెక్స్ పోస్టర్లు సభా వేదిక వద్దకు స్వాగతం పలికేలా ఏర్పాటు చేయించుకున్నారు. త్వరలో జరగనున్న ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లను ఆకట్టుకునేందుకు పలువురు రాజకీయ నేతలు అక్రమ కోడిపందాలను ప్రోత్సహిస్తుండటం గమనార్హం.