Sankranti Cockfights : ఈసారి సంక్రాంతి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల్లో దాదాపు రూ.1,500 కోట్లు విలువైన కోడిపందేలు జరిగాయట. వీటిలో సగానికిపైగా విలువ చేసే కోడిపందేలు ఒక్క ఉమ్మడి గోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లోనే జరిగినట్లు తెలుస్తోంది. ఈ మూడు రోజుల్లో రాత్రి, పగలు అనే తేడా లేకుండా కోడిపందేలు జోరుగా కొనసాగాయి. కూరగాయల సంచుల్లో నోట్ల కట్టలు తెచ్చి మరీ ఔత్సాహికులు కోడి పందేలు కాశారని తెలిసింది. అయితే కోడిపందేల మాటున పలుచోట్ల మోసాలు కూడా జరిగాయి. ఈసారి కోడిపందేల్లో (Sankranti Cockfights) పాల్గొన్న ఒక్కొక్కరికి ఒక్కో విధమైన ఫలితం వచ్చింది. వారందరికీ ఒక్కో విధమైన అనుభవం మిగిలింది. మొత్తాన్ని ఈ పందేల వల్ల ఆర్థికంగా నష్టపోయిన వారే ఎక్కువ మంది ఉన్నారు. ఈ ప్రభావం తదుపరిగా ఆయన కుటుంబాలపై ప్రతికూలంగా పడనుంది.
Also Read :Hindenburg Research: ‘అదానీ’ని కుదిపేసిన ‘హిండెన్‌బర్గ్’ మూసివేత.. ఎందుకు ?
- తెలంగాణకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి భీమవరం మండలం డేగాపురంలో మూడు రోజుల పాటు కోడిపందేలు ఆడారు. ఆయన రూ.50 లక్షలను చేతులారా పోగొట్టుకున్నారు. చివరకు ఆ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తన కారును తాకట్టుపెట్టి మరీ రూ.25 వేలు పందెం కాయగా.. రూ.50 వేలు వచ్చాయి. ఆ డబ్బులతో కారును విడిపించుకొని అక్కడి నుంచి ఆయన ఇంటిముఖం పట్టాడు.
- చెన్నైకు చెందిన ఓ వ్యాపారి డేగాపురంలో ఐదు కోడిపందేల్లో రూ.50 లక్షలు పోగొట్టుకున్నాడు. అయితే ఈయనకు జూదం, గుండాటల్లో రూ.5 లక్షలు వచ్చాయి.
- తాడేపల్లిగూడెం పట్టణంలోని పైబోయిన వెంకట్రామయ్య బరి వద్ద బుధవారం రోజు దాదాపు రూ.1.25 కోట్ల కోడిపందేలు జరిగాయి. ఇక్కడి కోడిపందేల బరి వద్ద వచ్చినవారిని నియంత్రించేందుకు లేడీ బౌన్సర్లను ఏర్పాటు చేశారు.
- సంక్రాంతి వేళ ఏపీలో చాలా చోట్ల జూద క్రీడలు నిర్వహించారు. జూదరులను ఆకట్టుకునేందుకు పలుచోట్ల ఛీర్ గర్ల్స్‌ను సైతం ఏర్పాటు చేశారని తెలిసింది.
- కొన్నిచోట్ల క్యాసినో తరహాలో జూదపు ఆటలు సాగాయి.
- కోత ముక్క, గుండాట వంటి జూదాలలో కూడా వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు సమాచారం.
- పండుగ వేళ మద్యం వ్యాపారం కూడా భారీగానే జరిగింది.