ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) ఇటీవల క్యాబినెట్ (AP Cabinet ) హోదా కలిగిన అధికారుల జీతభత్యాలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రకారం, క్యాబినెట్ హోదా కలిగిన వారికి నెలకు రూ. 2 లక్షల జీతం చెల్లించనున్నారు. జీతంతో పాటు కార్యాలయ అవసరాలకు, ఫర్నీచర్ ఏర్పాటు కోసం ప్రభుత్వం వన్టైం గ్రాంట్ అందించనుంది. అలాగే, వ్యక్తిగత సహాయ సిబ్బంది అలవెన్సులు, ఇతర సౌకర్యాల కోసం మరో రూ. 2.50 లక్షల నిధులను అందజేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అంటే క్యాబినెట్ హోదా కలిగిన వ్యక్తులు నెలకు మొత్తం రూ. 4.50 లక్షలు పొందనున్నారు.
Game Changer Collections : గేమ్ ఛేంజర్ వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్స్
ఈ నిర్ణయం వలన క్యాబినెట్ హోదా ఉన్న అధికారుల పనితీరు మెరుగుపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విధమైన జీతాలు, సౌకర్యాలు అందించడం అధికారులకు ప్రోత్సాహకంగా ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అలాగే, ఇది వారి బాధ్యతలను మరింత సమర్థంగా నిర్వహించేందుకు సహాయపడుతుందని పేర్కొంటున్నారు. అయితే, ఈ నిర్ణయంపై విమర్శలు కూడా ఎదురవుతున్నాయి. ప్రజా ప్రతినిధులు, క్యాబినెట్ హోదా కలిగిన వారికి అధిక మొత్తంలో జీతాలు, సౌకర్యాలు కల్పించడం ప్రజాధనం అనవసరంగా వ్యయమవుతుందని కొందరు విమర్శిస్తున్నారు. సామాన్య ప్రజల సమస్యలపై మరింత శ్రద్ధ పెట్టకుండా, ఈ విధమైన ఆర్థిక ప్రయోజనాలు కేటాయించడం అనుచితమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై ప్రజల నుంచి ఎలా స్పందన వస్తుందో వేచిచూడాల్సి ఉంది.