Sake Sailajanath: వైసీపీలోకి శైలజానాథ్‌.. కండువా కప్పి ఆహ్వానించిన వైఎస్‌ జగన్‌

Sake Sailajanath: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని శింగనమల నియోజకవర్గానికి ప్రత్యేకమైన రాజకీయ ప్రాధాన్యత ఉంది. గత 30 ఏళ్లుగా, ఈ నియోజకవర్గంలో విజయం సాధించిన పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ఒక సెంటిమెంట్ కొనసాగుతోంది. వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో శైలజానాథ్ కాంగ్రెస్ అభ్యర్థిగా శింగనమల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

Published By: HashtagU Telugu Desk
Sake Sailajanath

Sake Sailajanath

Sake Sailajanath: కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ వైఎస్సార్‌సీపీలో చేరారు. శుక్రవారం ఉదయం మాజీ సీఎం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్‌ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. శింగనమల వైసీపీ ఇంచార్జ్‌గా శైలజానాథ్‌ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా శైలజానాథ్‌ మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధమన్నారు. ప్రజల తరుపున వైఎస్సార్‌సీపీ పోరాడుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని శింగనమల నియోజకవర్గానికి ప్రత్యేకమైన రాజకీయ ప్రాధాన్యత ఉంది. గత 30 ఏళ్లుగా, ఈ నియోజకవర్గంలో విజయం సాధించిన పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ఒక సెంటిమెంట్ కొనసాగుతోంది. వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో శైలజానాథ్ కాంగ్రెస్ అభ్యర్థిగా శింగనమల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత టీడీపీ నుంచి శమంతకమణి, ఆమె కుమార్తె యామిని బాల మంత్రులుగా, ఎంఎల్ఏలుగా సేవలందించారు. 2019లో వైసీపీ తరఫున జొన్నలగడ్డ పద్మావతి విజయం సాధించగా, 2024 ఎన్నికల్లో ఆమె టికెట్ పొందలేకపోయారు.

Arrest Warrant Against Sonu Sood: సోనూ సూద్‌పై అరెస్ట్ వారెంట్ జారీ.. ఏ కేసులో చిక్కుకున్నాడు?

ఇప్పుడు శింగనమల నియోజకవర్గానికి కొత్త నాయకుడి అవసరం ఉండటంతో జగన్ శైలజానాథ్ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతోనే శైలజానాథ్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2004లో ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకుని తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన, 2009లో కూడా గెలిచారు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు.

ఏపీ విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి పెద్దగా అవకాశాలు లేకపోవడంతో, శైలజానాథ్ రాజకీయంగా లోపలి దశలోకి వెళ్లిపోయారు. పీసీసీ చీఫ్‌గా రఘువీరా రెడ్డి తర్వాత ఆయన ఆ పదవి చేపట్టారు. అయితే, జగన్‌పై తీవ్ర విమర్శలు చేయకపోవడం, అలాగే రాజకీయాల్లో పూర్తి స్థాయిలో చురుగ్గా లేకపోవడం వల్ల ఆయన కాంగ్రెస్‌లో కీలక స్థాయిని పొందలేకపోయారు. ఇప్పుడు జగన్ ఆహ్వానం మేరకు వైసీపీలో చేరి మరోసారి రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు.

Pensions in AP : ఏపీలో పింఛన్‌లు తీసుకునేవారికి శుభవార్త

  Last Updated: 07 Feb 2025, 11:10 AM IST