AP Politics: చంద్రబాబుపై సజ్జల సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే!

AP Politics: వైసిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు మళ్ళీ ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటున్నారని, అబద్ధపు హామీలు ఇచ్చి మళ్ళీ అధికారంలో రావాలని చంద్రబాబు చూస్తున్నాడని ఫైర్ అయ్యారు. వాలంటరీలు గోని సంచులు మోసే వాళ్ళని మగాళ్ళు లేనప్పుడు తలుపులు కొడతారని హేళనగా మాట్లాడారని, అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ మాట్లాడింది నిజం కాదా […]

Published By: HashtagU Telugu Desk
Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy

AP Politics: వైసిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు మళ్ళీ ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటున్నారని, అబద్ధపు హామీలు ఇచ్చి మళ్ళీ అధికారంలో రావాలని చంద్రబాబు చూస్తున్నాడని ఫైర్ అయ్యారు.

వాలంటరీలు గోని సంచులు మోసే వాళ్ళని మగాళ్ళు లేనప్పుడు తలుపులు కొడతారని హేళనగా మాట్లాడారని, అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ మాట్లాడింది నిజం కాదా .. వాలంటీరీలను ఉద్దేశించి పవన్ ,చంద్రబాబు మాట్లాడిన మాటలు ఇప్పుడు మర్చిపోతారని అనుకుంటున్నారా అని సజ్జల అన్నారు.

వాలంటరీలకు పదివేలు ఇస్తానని చెప్తే నమ్మే స్థితిలో వాలంటరీలు రాష్ట్ర ప్రజలు ఎవరూ లేరని, వాలంటరీ వ్యవస్థను తీసేస్తానని ఇప్పుడు అధికారంలోకి రావడం కోసం అబద్ధపు హామీలు ఇస్తే నమ్మే స్థితిలో లేరు. 1995లో చంద్రబాబు ఎలా ఉన్నాడో 2024 లో కూడా అలాగే ఉన్నాడని, వాలంటరీ వ్యవస్థను రద్దుచేసి జన్మభూమి కమిటీలను మళ్లీ తెస్తాడని మండిపడ్డారు.  చంద్రబాబు వస్తె వాలంటరీలని తీసేసి జన్మభూమి కమిటీలకు వాలంటరీలని పేరు పెట్టి మళ్ళీ సొంత పార్టీ వాళ్ళని నియమిస్తాడు . టిడిపి చెప్పిన వాళ్ళకి పథకాలు ఇవ్వాలని చంద్రబాబు చెబుతాడని సజ్జల విమర్శించారు.

  Last Updated: 11 Apr 2024, 08:17 PM IST