Site icon HashtagU Telugu

Chandrababu : చంద్రబాబు అవినీతిపై చర్చ లేకుండా చేసేందుకే అనారోగ్యం అంటూ డ్రామాలు – సజ్జల

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆరోపణలు ఎదురుకుంటూ చంద్రబాబు (Chandrababu) రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. గత 40 రోజులుగా ఆయన జైల్లో ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ప్రతి రోజు డాక్టర్స్ ఆయనను పరివేక్షించి జాగ్రత్తలు సూచిస్తున్నారు. అయితే జైల్లో చంద్రబాబు కు ప్రాణ హాని ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తూ కోర్ట్ లలో పిటిషన్ లు దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) టీడీపీ చేస్తున్న ఆరోపణలపై కీలక వ్యాఖ్యలు చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

చంద్రబాబు కు (Chandrababu ) ప్రతీ రోజూ చెకప్ చేసి రిపోర్ట్స్ కోర్టుకు పంపిస్తున్నారన్నారు. చంద్రబాబు ను ఆయన కుటుంబసభ్యులే బట్టలిప్పి బయట నిలబెడుతున్నారని తీవ్ర వాఖ్యలు చేశారు. సాధారణ ప్రజాజీవితానికి ఇబ్బంది కలిగేలా టీడీపీ నేతలు (TDP Leaders) వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జరిగిన అవినీతిపై చర్చ లేకుండా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత టీడీపీ నాయకులు, కార్యకర్తలు వ్యవహరిస్తున్న తీరు సాధారణ ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఉంది. లేని సమస్యను వాళ్లే క్రియేట్‌ చేస్తూ, అవినీతి కేసులో ఆధారాలతో సహా ఆ పార్టీ నాయకుడు చంద్రబాబు అరెస్ట్‌ అయితే నానా హంగామా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.

2014లో టీడీపీ పార్టీకి అధికారం అప్పజెప్తే ఆ పార్టీ అధినేతే ఒక కుంభకోణానికి తెరలేపి దొరికిపోయాడు. సాంకేతిక పరమైన అంశాలను తెరమీదకు తెచ్చి అవినీతి అంశాన్ని పక్కకు నెట్టేస్తున్నారు. చంద్రబాబుకు జలుబు చేసినా, చర్మవ్యాధులు ఏమైనా ఉంటే వాటిని ప్రాణాంతకమైన వ్యాధి అన్నట్లుగా టీడీపీ నేతలు చూపుతున్నారు. జైలు నిబంధనలే కాదు..ఇంకేవీ అడ్డం రాకూడదు..ఇదేదో మానవత్వానికి సంబంధించిన అంశమైనట్లు, ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తిస్తోందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్ట్‌ జరిగి 40 రోజులైతే వీళ్ల డ్రామాలకు కూడా 40 రోజులుగా సాగుతూనే ఉందన్నారు. చంద్రబాబు మాజీ పీఎస్ వస్తే అంతా బయట పడుతుందన్నారు. చంద్రబాబు ను అక్రమంగా ఇరికించలేదని మరో సారి తేల్చి చెప్పారు.

Read Also : Telangana : 37 మందితో బిజెపి ఫస్ట్ లిస్ట్..ఎవరెవరి పేర్లు ఉన్నాయంటే..!