YS Sunitha : సునీత పలికిన మాటలు.. చంద్రబాబు పలికించినవే – సజ్జల

  • Written By:
  • Publish Date - March 1, 2024 / 07:48 PM IST

రాబోయే ఎన్నికల్లో తన అన్న, సీఎం వైఎస్ జగన్ పార్టీకి ఓటేయొద్దని ..హత్యా రాజకీయాలు చేసేవారు పాలించకూడదు అంటూ వైఎస్ సునీత (YS Sunitha) ఢిల్లీ వేదికగా ఏపీ రాష్ట్ర ప్రజలను కోరిన సంగతి తెలిసిందే.తన తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్య జరిగి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు నిందితులకు శిక్ష పడలేదు..ఇలాంటి హత్య రాజకీయాలు చేసే వారికీ తగిన బుద్ది చెప్పాలని , మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే ప్రజలకు కష్టాలే అని సునీత చెప్పుకొచ్చారు. వైసీపీకి ఓటు వేయొద్దు.. వంచన చేసిన, మోసం చేసిన పార్టీకి ఓటు వేయొద్దు అని కోరారు. కాగా సునీత వ్యాఖ్యలపై వైసీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి స్పందించారు. సునీత పలికిన మాటలు.. చంద్రబాబు పలికించినవే అంటూ ఆయన విమర్శించారు.

We’re now on WhatsApp. Click to Join.

సునీత ఎవరి ప్రతినిధిగా మాట్లాడుతున్నారో, ఎవరి ప్రతినిధిగా ఇన్నాళ్లూ తప్పుడు కేసు బిల్డ్‌ చేస్తున్నారో అంతా ఈ రోజు బయటపడింది. ఆమె మాట్లాడిన దానికంటే.. ఇందుకు వేరే ఆధారాలు అవసరం లేదు. ఆమె మాట్లాడినవన్నీ చంద్రబాబు పలికించిన చిలుకపలుకులు అనేది ఇంతకంటే పెద్ద ఆధారం ఏమీ ఉండదు. ఆమె తన తండ్రి ఎమ్మెల్సీగా ఓడిపోవడానికి మేమే కారణమని ఆరోపిస్తున్నారు. ఆనాడు 2017లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు 160 పైగా ఓట్లు అధికంగా వైసీపీకి ఉన్నాయి. స్థానిక సంస్థల కోటా కింద వివేకానందరెడ్డి గారు థంపింగ్‌ మెజార్టీతో గెలవడానికి కావాల్సినన్ని ఓట్లు పార్టీకి ఉన్నాయి. అందుకోసమే తన చిన్నాన్నను జగన్‌ గారు అభ్యర్థిగా పెట్టారు. చంద్రబాబులా ఓడిపోయే సీటుకు పోటీ పెట్టలేదు. మేము గెలిచే సీటుకు ఆయన తన చిన్నాన్న గారిని పెట్టారు. వైఎస్సార్‌ గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్‌ వైపు వెళ్లి జగన్‌ గారిని రాజకీయంగా అంతుచూడాలని..విజయమ్మ గారి మీద వారే పోటీకి దిగారు. అయినా వివేకాను దగ్గరకు తీసుకున్నది వైఎస్‌ జగన్‌ గారు. వివేకా కూడా అలానే వచ్చి పార్టీలో కలిసిపోయారు అని సజ్జల చెప్పుకొచ్చారు.

“వివేకాను చంపాల్సిన అవసరం టీడీపీ నేతలకే ఉంది. వివేకా కేసుపై చంద్రబాబునే సునీత ప్రశ్నించాలి నాడు అధికారంలో ఉన్న చంద్రబాబు.. వివేకా కేసును ఎందుకు పరిష్కరించలేదు..? ఒక సీనియర్ నేతగా వివేకాను జగన్ గౌరవించారు. అసలు వివేకా ఎమ్మెల్యేగా ఓడిపోవడానికి కారణం ఎవరు…? ఇదే చంద్రబాబు, బీటెక్ రవి కాదా…? అలాంటి వ్యక్తులు ఇవాళ స్నేహితులు అయ్యారు. సునీత ఇవాళ ముసుగు తీసేసింది.వివేకా కేసులో సునీత కుటుంబ సభ్యులపై కూడా పలు అనుమానాలు ఉన్నాయి. వారి పాత్ర కూడా ఏమైనా ఉండొచ్చు. వీటన్నింటిపై కూడా విచారణ జరుగుతుంది. సునీత ఎన్నికల్లో పోటీ చేస్తే మంచిదే. అంతిమంగా ప్రజలే నిర్ణయిస్తారు” అని సజ్జల పేర్కొన్నారు.

Read Also ; Pulivendula : పులివెందులలో టీడీపీ కి భారీ షాక్..వైసీపీ లో చేరిన సతీష్ రెడ్డి