మెగాస్టార్ చిరంజీవి (CHiranjeevi) తాజాగా కూటమి అభ్యర్థులకు (NDA Alliance) మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మద్దతు ఫై వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి స్పందించారు. ఏపీలో ఎన్నికల హోరు రోజు రోజుకు రసవత్తరంగా మారుతుంది. గత ఎన్నికల్లో సైలెంట్ గా ఉన్న సినీ ప్రముఖులు ఇప్పుడు నేరుగా కూటమికి మద్దతు తెలుపుతూ వస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ నటులు కూటమి తరుపు అభ్యర్థులకు ప్రచారం చేస్తూ ప్రజలను కూటమి అభ్యర్థులకు ఓటు చేసి రాష్ట్రాన్ని కాపాడాలంటూ ప్రచారం చేస్తుండగా..ఈరోజు మెగాస్టార్ చిరంజీవి సైతం స్పందించారు.
We’re now on WhatsApp. Click to Join.
టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ఏపీలో గెలిస్తే రాష్ట్రం కచ్చితంగా అభివృద్ధి చెందుతున్న నమ్మకం ఉందని… చిరంజీవి చెప్పుకొచ్చారు. అందుకోసమే అనకాపల్లి ఓటర్లు తమ కూటమి ఎంపీ అభ్యర్థి అయిన సీఎం రమేష్ కు ఓట్లు వేసి గెలిపించుకోవాలని చెప్పారు. అలాగే పెందుర్తి శాసన సభ స్థానం నుంచి కూటమి తరఫున పోటీ చేస్తున్న ఎమమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల బాబుకు ఓటు వేసి గెలిపించుకోవాలని సూచించారు. వారిద్దరినీ పక్కన కూర్చోబెట్టుకుని మరీ వీడియో చేసిన చిరంజీవి.. కూటమిని గెలిపించాలన్నారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత రాజకీయాల ఫై స్పందించడం..కూటమికి సపోర్ట్ చేయడం తో కూటమి పార్టీ నేతల్లో జోష్..రాష్ట్ర ప్రజల్లో మరింత నమ్మకం ఏర్పడింది. ఈ క్రమంలో చిరంజీవి సపోర్ట్ ఫై సజ్జల స్పందించారు. కూటమి అభ్యర్థులకు చిరంజీవి మద్దతు ప్రకటించడంలో ఆశ్చర్యమేమీ లేదని, ‘చిరంజీవే కాదు, ఎంతమంది కలిసొచ్చినా కూటమికి ఒరిగేదేమీ లేదు. ఏపీలో గుంటనక్కలు, తోడేళ్లు ఒక్కటయ్యాయి. అవి ఒకవైపు, జగన్ ఒక్కడే ఒకవైపు. జనం ఆయనతోనే ఉన్నారు అని తెలిపారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా సజ్జల కీలక వ్యాఖ్యలు చేసారు.
పవన్ కల్యాణ్ ఓ పార్టీ అధినేత అనేది పక్కన పెడితే ఆయన జనసేన పార్టీని ఎందుకు పెట్టాడో తెలియదు.నాయకుడుగా ఆయన ఆలోచనల్లో ఎప్పుడూ స్పష్టత లేదు. బహుశా చంద్రబాబు కోసమే ఆయన పుట్టినట్లు…పెరిగినట్లుగా ఉన్నాడు. చంద్రబాబుకే అంకితమైనట్లుగా ఉన్నాడు. ఈ ఎన్నికలలో చంద్రబాబు పార్టీ అంతం కావడంతో పవన్ కల్యాణ్ రాజకీయ అంకం కూడా ముగుస్తుందన్నట్లుగా ఉంది. ఎందుకంటే ఆయనకు ఏమీ తెలియదు చంద్రబాబు ఏమీ చేయమంటే అది చేస్తాడు.ఆయన బటన్ నొక్కకపోతే పవన్ ఆగిపోతాడు. చంద్రబాబు ఏ మాటలు చెప్పమంటే అదే చెబుతాడు…ఆయన వద్దంటే ఆగిపోతాడు. ఆయన మెచ్యూర్డ్ రాజకీయనేత కాదు.. ఆయనకు అంత విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు..విశ్లేషణ కూడా అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
Read Also : Rajamouli-Mahesh: రాజమౌళి, మహేశ్ మూవీ నుంచి మరో కీలక అప్డేట్.. షూటింగ్ ఎప్పుడంటే