Site icon HashtagU Telugu

Arrest : సజ్జల & భార్గవ్ ప్రస్తుతానికి సేఫ్.. కానీ ఎంతకాలం?

Sajjala Ramakrishna Reddy &

Sajjala Ramakrishna Reddy &

గత వైసీపీ (YCP) పాలనలో జగన్ (Jagan) మెప్పు కోసం ప్రతిపక్ష నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వారు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కోర్టుల చుట్టూ, జైళ్ల (Jail) చుట్టూ తిరుగాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సజ్జల రామకృష్ణా రెడ్డి, ఆయన కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డి (Sajjala Ramakrishna reddy & Bhargav) ఈ కేసుల బారిన పడటంతో వారిద్దరూ ముందస్తు బెయిల్‌ (Bail) పొంది ఉపశమనం అయ్యారు. కానీ ఈ ఉపశమనం అనేది ఎంత వరకు అనేది ఇప్పుడు వారిని నిద్ర పట్టకుండా చేస్తుంది. ఈ కేసులు ఏమేరకు నడుస్తాయో, వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో అనేది ప్రశ్నార్థకంగా మారింది.

Myanmar Earthquake Updates: విధ్వంసం సృష్టించిన భూకంపం.. 144కు చేరిన మృతుల సంఖ్య‌?

గత ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష నాయకులపై అనవసర ఆరోపణలు చేసిన వైసీపీ నేతలు, ఇప్పుడు లీగల్ చిక్కుల్లో పడుతున్నారు. ముఖ్యంగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీని వీడి వైసీపీలో చేరిన తర్వాత టీడీపీ కార్యాలయంపై దాడి చేయించిన ఘటనకు సంబంధించి కోర్టు బెయిల్ తిరస్కరించడం జరిగింది. వంశీ ఇప్పుడు హైకోర్టు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకుని చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్న ఇప్పుడు వైసీపీ నేతలను వెంటాడుతోంది.

Samsung : ఏఐ -శక్తితో కూడిన స్మార్ట్‌ఫోన్, గెలాక్సీ ఏ 26 5జి ని విడుదల చేసిన సామ్‌సంగ్

రాజకీయాల్లో విమర్శలు సహజమే, కానీ అధికారంలో ఉన్నపుడు ప్రతిపక్ష నాయకులను అవహేళన చేయడం, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న వైసీపీకి ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా సినీ ప్రముఖులు రాంగోపాల్ వర్మ, పోసాని కృష్ణ మురళి లాంటి వారు కూడా జగన్ అండతో బహిరంగంగా విమర్శలు చేయడం, ఇప్పుడు వారికి కూడా సమస్యల రూపంలో మారింది. రాంగోపాల్ వర్మ ముందే బెయిల్ పొందగా, పోసాని నేరుగా కేసులో ఇరుక్కొన్న పరిస్థితి నెలకొంది. ఈ పరిణామాలు రాజకీయాల్లో పరిమితి మీరిన విమర్శలు, ఆధారాలు లేకుండా చేసిన ఆరోపణలు ఎలాంటి సమస్యలు తీసుకురాగలవో చూపిస్తున్నాయి. ఇప్పుడు కేసులు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలు దీనికి టీడీపీని నిందిస్తున్నప్పటికీ, తమ గత చర్యలే దీనికి కారణమని వారికి బాగా తెలుసు.