వైస్ షర్మిల రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ లో రాజన్న రాజ్యం తీసుకరావాలని వైస్ షర్మిల ఎన్నో కలలు కంటూ…రాజన్న రాజ్యం స్థాపనే లక్ష్యమంటూ 2021 జులై 8న వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ (YSRTP) పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు. పార్టీ స్థాపించగానే కేసీఆర్ ఫై పోరాటం మొదలుపెట్టింది. తెలంగాణ వ్యాప్తంగా సుదీర్ఘమైన పాదయాత్ర చేస్తూ కేసీఆర్ ఫై విమర్శలు కురిపిస్తూ.. ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంది. ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలఫై పోరాటం చేస్తూ వచ్చింది. ధర్నాలు, నిరాహార దీక్షలు ఇలా ఎన్నో చేసి..వార్తల్లో నిలిచింది. కానీ ఇతర పార్టీల నేతలను ఆకట్టుకోలేకపోయింది. ఇదే క్రమంలో రాష్ట్రంలో కాంగ్రెస్ హావ పెరుగుతుండడం తో షర్మిలను పట్టించుకునే నాధుడు లేకుండాపోయాడు. అయినప్పటికీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని.. తాను పాలేరు నుంచి బరిలోకి దిగుతానని ప్రకటించింది. అయితే ఎన్నికలకు ముందు అనుహ్యంగా పోటీ నుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశ్యంతో తమ పార్టీ పోటీ నుంచి తప్పుకుటుంటుందని ప్రకటించారు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయిన షర్మిల..చివరకు తన పార్టీ ని కాంగ్రెస్ లో కలుపుతూ..ఆమెకూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంది. అయితే షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు హస్తం ఉందంటూ వైసీపీ సలహాదారుడు సజ్జల రామకృష్ణ రెడ్డి సంచలన ఆరోపణలు చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
షర్మిల కాంగ్రెస్‌లో చేరడం వెనుక చంద్రబాబు కచ్చితంగా ఉన్నారని అందుకు తమ దగ్గర చాలా ఆధారాలున్నాయన్నారు. సీఎం రమేష్‌కు సంబంధించిన సొంత విమానంలోనే షర్మిల, బ్రదర్ అనిల్ ఢిల్లీకి వెళ్లారని.. ఎయిర్‌పోర్టులో బీటెక్ రవి, బ్రదర్ అనిల్ కుమార్ భేటీ అయ్యారని చెప్పుకొచ్చారు. టీడీపీ నేత బీటెక్ రవిని బ్రదర్ అనిల్ కలవడం కూడా ఆ కుట్రలో భాగమేనన్నారు. అంతకు ముందు బెంగళూరులో కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో చంద్రబాబు చర్చలు జరపడం..ఇవన్నీ చూస్తుంటే షర్మిల కాంగ్రెస్ గూటికి చేరడం చంద్రబాబు ఆలోచనే అని సజ్జల గట్టిగా చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌తో చంద్రబాబు తెరవెనుక రాజకీయం కొనసాగుతూనే ఉందని ఆరోపించారు. ఈసారి ఎన్నికల్లో ఓటమి తప్పదని చంద్రబాబుకు అర్థం అయిందని.. అందుకే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను డైవర్ట్ చేయడానికే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. షర్మిల రాజకీయంగా ఎక్కడనుంచైనా ప్రాతినిధ్యం వహించొచ్చని.. ఆమె వల్ల వైసీపీ పార్టీకి వచ్చే నష్టం ఏమీ ఉండదని అభిప్రాయపడ్డారు.
మరి సజ్జల చేసిన ఆరోపణల్లో నిజం ఉందా..? షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక బాబు హస్తం ఉందా..? అనేది క్లారిటీ లేదు. ఏదొక ప్రతిపక్షం ఫై ఆరోపణ చేయాలి కాబట్టి..అందులోని ఎన్నికల ముందు ఎక్కువగా ఆరోపణలు చేస్తేనే ఆ పార్టీ ఫై ప్రజల్లో నమ్మకం పోతుందని సజ్జల ఇలా చేసి ఉంటారని టీడీపీ శ్రేణులు అంటున్నారు.
Read Also : YS Sharmila meet CM Revanth : సీఎం రేవంత్ కలిసిన షర్మిల..నెక్స్ట్ చంద్రబాబేనా..?