Site icon HashtagU Telugu

Sadarem : నేటి నుంచి ఏపీలో సదరం స్లాట్ బుకింగ్స్

Sadaram Slat

Sadaram Slat

వైకల్య ధ్రువీకరణ పత్రాల కోసం నిర్వహించే సదరం స్లాట్ బుకింగ్ (Sadarem Slot Booking) శిబిరాలు నేటి నుంచి ఏపీలో ప్రారంభం కానున్నాయి. జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు స్లాట్లను విడుదల చేశారు. ఇందుకోసం మీసేవ, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఆన్లైన్లో ముందస్తు స్లాట్లను బుక్ చేసుకోవచ్చు. స్లాట్లు బుక్ చేసుకున్న వారికి ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు స్క్రీనింగ్ నిర్వహించి ధ్రువీకరణ పత్రాలు జారీ చేయనున్నారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడం తో రాష్ట్ర ప్రజలంతా ఎంతో సంతోషిస్తున్నారు. ముఖ్యంగా పెన్షన్ దారుల ఆనందాలు మాములుగా లేవు. వికలాగులకు గతంలో 3వేల రూపాయలు ఉన్న పింఛన్​ ఇప్పుడు 6వేలకు చేరడంతో పాటు జూలై 1న అధికారులే స్వయంగా ఇంటికి వచ్చి అందించేసరికి మా పెద్ద కొడుకు చంద్రబాబు అంటూ వారంతా ఆశీర్వదిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటె ఈరోజు నుండి రాష్ట్రంలో సదరం స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. లబ్ధిదారుల ఎంపికకు జులై 8 నుంచి స్లాట్లు అందుబాటులో ఉండనున్నాయి. శారీరక వైకల్యం, మానసిక లోపాలు, కంటి చూపునకు సంబంధించి దృష్టి వైకల్యం ఇతర లోపాలతో బాధపడే వారికి వైకల్యాన్ని నిర్ధారిస్తూ అందించేదే ఈ సదరం సర్టిఫికెట్​. దీనిని ప్రైవేటు వ్యక్తులు, వైద్యులు కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వివిధ రకాల కొలమానాల ప్రకారం అందిస్తుంటారు. ఏదైనా ప్రమాదం జరిగి అవయవాలు కోల్పోయిన వారికి ఆర్థో, అందత్వం, వినికిడి, మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం సదరం సర్టిఫికెట్ జారీ చేస్తుంది.

ఈ సర్టిఫికెట్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అందించే పింఛన్​, ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్, రాష్ట్ర, కేంద్ర రవాణా సంస్థలైన ఆర్టీసీ బస్సులు, రైళ్లలో ప్రయాణ చార్జీల్లో రాయితీలు, చిన్న పరిశ్రమ స్థాపనకు రుణాలు, సబ్సిడీకి ఈ సదరం సర్టిఫికెట్ ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అందుకే లోపాలు ఉన్న వారు ఈ సర్టిఫికెట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు చంద్రబాబు ఆ అవకాశం ఇవ్వడం తో ఉదయాన్నే దానికి సంబదించిన పనుల్లో బిజీ అయ్యారు.

Read Also : Phone Tapping : కేటీఆర్ ఆదేశాలతోనే ఆ కేసులు.. ‘ఫోన్ ట్యాపింగ్’‌ కేసు దర్యాప్తులో వెలుగులోకి