Site icon HashtagU Telugu

Rudakota Mystery : మన్యం జిల్లాలో రహస్యం..గర్భం దాల్చాలంటేనే భయపడుతున్న మహిళలు

Rudakota Village Mystery

Rudakota Village Mystery

దేశం ఎంతో అభివృద్ధి పధంలో దూసుకెళ్తున్న..ఇంకా చాల చోట్ల అంతుచిక్కని వ్యాధులతో చాలామంది చనిపోతున్నారు. కళ్లముందు ఎంతో సంతోషంగా ఆడుతూపాడుతూ..తిరుగుతున్న పిల్లలు ఒక్కసారిగా కిందపడి..హాస్పటల్ కు తరలించేలోపే చనిపోతున్నారు. ఇలా ఒకరిద్దరు కాదు దాదాపు 20 మందికిపైగా చిన్నారులు చనిపోయారు..ఇంకా చనిపోతూనే ఉన్నారు. ఈ ఘటన ఏపీలోని మన్యం జిల్లా (Manyam District) పెదబయలు (Peda Bayalu) మండలంలోని రూఢకోట గ్రామంలో (RudaKota Village) చోటుచేసుకుంటుంది.

Read Also : Kiss : మీడియా ముందే హీరోయిన్ కు ముద్దు పెట్టిన డైరెక్టర్..

గత కొన్ని సంవత్సరాలుగా మూడు నుండి ఆరు ఏళ్ల లోపు పిల్లలు ఒకే రకంగా చనిపోవడం ఈ ఊరి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుంది. ఇలా కళ్లముందే పసిబిడ్డలు చనిపోతూ ఉండడం చూసి..గర్భం దాల్చేందుకు మహిళలు భయపడుతున్నారు. రీసెంట్ గా గ్రామానికి చెందిన అశోక్ అనే వ్యాన్ డ్రైవర్ పిల్లలు అలాగే చనిపోయారు. తమ పిల్లలు ఎందుకు చనిపోతున్నారో అర్ధం కాక ఆ తల్లిదండ్రులు ఆయోమయానికి గురవుతున్నారు. 2022 చివరి మూడు నెలల్లో 17 మంది శిశువులు, 2023 తొలి మూడు నెలల్లో మరో ముగ్గురు వింత వ్యాధితో చనిపోయారని.. హాస్పటల్ కు తీసుకెళ్లే లోపే మరణిస్తున్నారని స్థానిక డాక్టర్ తెలిపాడు. ఈ వరుస మరణాలపై 2022లో ఈ గ్రామంలో ఆంధ్ర మెడికల్ కాలేజీ వైద్య బృందం పర్యటించింది. కానీ మరణాలకు స్పష్టమైన కారణాలను కనిపెట్టలేకపోయింది.

ఆ సమయంలో నీటిని పరిశీలించి.. అవి కూడా బాగానే ఉన్నట్లు ఆ బృందం తేల్చింది. అయితే ఈ మరణాలు ఎందుకు జరుగుతున్నాయనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. డెలివరీ అయ్యే వరకు ఈ ఊర్లో ఉండాలంటే భయం భయంగా ఉందని స్థానిక మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మరణాల ఫై ఐటీడీఏ పీవో అభిషేక్ మాట్లాడుతూ.. శిశు మరణాలపై అధ్యాయనం జరుగుతుందని వైద్య సిబ్బంది నిరంతరం పరీక్షిస్తుందని ఆయన తెలిపారు. సురక్షిత మంచినీటి పాటు.. నాటు మందుల వాడకం, మద్యపానం వల్ల కలిగే నష్టాలను గురించి అవగాహన కల్పిస్తున్నామని అభిషేక్ తెలిపారు. కానీ అక్కడి గ్రామస్థులు మాత్రం ఇవేమి కాదని..గ్రామానికి ఏదో పట్టిందని అంటున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి మరణాలు ఆగేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.