Site icon HashtagU Telugu

Rs 4 crore in 45 days : ట‌మోటా రైతుకు 45 రోజుల్లో 4 కోట్లు

Rs 4 Crore In 45 Days

Rs 4 Crore In 45 Days

ప్ర‌తి ఏడాది న‌ష్ట‌పోయే ట‌మోటా రైతు ( Rs 4 crore in 45 days) ఈ ఏడాది కోట్లు గ‌డించాడు. కేవ‌లం 45 రోజుల్లో 4కోట్లు సంపాదించిన చిత్తూరు జిల్లా రైతు రికార్ట్ సృష్టించారు. ఆ జిల్లాలోని కరకమండల గ్రామంలోని మురళి వార‌స‌త్వంగా వ‌చ్చిన 12 ఎక‌రాల‌తో పాటు మ‌రో 10 ఎక‌రాలు లీజుకు తీసుకుని ట‌మోటా వేశారు. కాలం క‌లిసిరావ‌డంతో పంట దిగుబ‌డి అనూహ్యంగా ల‌భించింది. అంతేకాదు, అనూహ్యంగా ట‌యోట ధ‌ర ఈ ఏడాది అత్య‌ధిక ధ‌ర‌ను న‌మోదు చేసింది. కిలో రూ. 200లు ప‌లుకుతోంది. గ‌త 45 రోజుల్లో 2కోట్లు విలువైన పంట‌ను విక్ర‌యించిన ముర‌ళి మ‌రో 2 కోట్లకు విక్ర‌యించేందుకు స‌ర‌కును సిద్ధం చేశారు.

ప్ర‌తి ఏడాది న‌ష్ట‌పోయే ట‌మోటా రైతు  ఈ ఏడాది కోట్లు( Rs 4 crore in 45 days)

వార‌స‌త్వంగా వ్య‌వ‌సాయం చేస్తోన్న ముర‌ళి ఇప్పుడు లాభాల‌ను ఆర్థించారు. గ‌త కొన్నేళ్లుగా అప్పుల పాల‌య్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 1.5కోట్లు అప్పు అయ్యాన‌ని మురళి చెబుతున్నారు. కిలో రూ. 4ల‌కు కూడా కొనేవాళ్లు లేని సంద‌ర్భాల‌ను ప‌లుమార్లు చూశాన‌ని( Rs 4 crore in 45 days) చెబుతున్నారు. కుటుంబం మొత్తం ట‌మోట పంట‌ను పండించ‌డం ద్వారా బ‌తుకుతోంది. ఏదో ఒక రోజు కోట్ల గ‌డిస్తాన‌ని నమ్ముతూ ఆయ‌న అదే పంట‌ను కొన్నేళ్లుగా పండిస్తున్నారు.

ఎనిమిదేళ్లుగా టమాటా సాగు చేస్తోన్న ముర‌ళి

అప్ప‌ట్లో ట‌మోటాలు విక్ర‌యించ‌డానికి కోలార్ కు ముర‌ళి వెళ్లేవార‌ట‌. క‌నీసం 130 కిలోమీట‌ర్లు ప్ర‌యాణం చేయాల్సి వ‌చ్చింది. కానీ, ఇప్పుడు APMC యార్డు మంచి ధరను అందిస్తుంద‌ని ముర‌ళి చెబుతున్నారు. గత ఎనిమిదేళ్లుగా టమాటా సాగు చేస్తోన్న ముర‌ళి ఇప్ప‌టిలా ఎప్పుడూ దిగుబ‌డిని సాధించ‌లేదట‌. ఉమ్మడి కుటుంబానికి వారసత్వంగా 12 ఎకరాల భూమి ఆయ‌న‌కు ఉంది. కొన్నేళ్ల క్రితం అదనంగా 10 ఎకరాలు కొనుగోలు చేసింది. నిజానికి గతేడాది జులైలో ఆయన కుటుంబం ధరల పతనం కారణంగా భారీగా నష్టపోయింది. రూ. 1.5 కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన‌ట్టు ( Rs 4 crore in 45 days) ముర‌ళి చెబుతున్నారు.

అప్పులన్నీ తీర్చిన తర్వాత ఇప్పటికి 45 రోజుల్లో రూ.2 కోట్లు

గ‌త ఏడాది విత్తనాలు, ఎరువులు, కార్మికులు, రవాణా ఇతర లాజిస్టిక్స్‌పై పెట్టుబడి పెట్టారు. త‌రచూ కరెంటు కోతలు కార‌ణంగా దిగుబ‌డి బాగా త‌గ్గింది. భారీగా న‌ష్ట‌పోవాల్సి వ‌చ్చింది. అయితే, ఈసారి విద్యుత్ స‌ర‌ఫ‌రా మెరుగుప‌డింది. ఈ ఏడాది నాణ్యమైన పంట పండింది. ఇప్పటివరకు 35 సార్లు పంట కోసిన‌ట్టు మ‌ర‌ళి చెబుతున్నారు. మరో 15-20సార్లు ట‌యోట కోయ‌డానికి ఎక్కువ అవకాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు.అత‌ని కుమారుడు
ఇంజనీరింగ్, కుమార్తె మెడిసిన్ చదువుతోంది. ప్ర‌స్తుతం గ‌తంలోని అప్పులన్నీ తీర్చిన తర్వాత ఇప్పటికి 45 రోజుల్లో రూ.2 కోట్లు రాబట్టగలిగిన‌ట్టు ( Rs 4 crore in 45 days) సంతోష పడుతున్నారు.

Also Read : Tomoto Keema Balls: ఎంతో స్పైసిగా ఉండే టమోటా కీమా బాల్స్.. తయారు చేయండిలా?

సంపాదించిన‌ డబ్బును భూమిపై పెట్టుబడి పెట్టాలని ముర‌ళి యోచిస్తున్నారు. పెద్ద మొత్తంలో హార్టికల్చర్‌లో తనను తాను పాలుపంచుకోవాలని యోచిస్తున్నాడు. ఆధునిక సాంకేతికతను అమలు చేయడంపై దృష్టి పెట్టారు. తన వద్ద ఉన్న దాదాపు 20 ఎకరాల భూమిని కూడా కొనుగోలు చేయాలని యోచిస్తున్నారు. కార్యకలాపాలను విస్తరించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. గ్రామంలోని రైతులందరికీ ఆయన ఒక సలహా కూడా మారారు. పంట విఫలం కావడం, అప్పుల ఊబిలో కూరుకుపోవడంపై బాధను పంచుకున్నారు ముర‌ళి. వ్య‌వ‌సాయాన్ని విశ్వసించేవాడు , గౌరవించేవాడు ఎప్పటికీ ఓడిపోడ‌ని ముర‌ళి అభిప్రాయం. మొత్తం మీద 45 రోజుల్లో 4 కోట్లు ఆర్జించిన రైతుగా ముర‌ళి రికార్ట్ నెల‌కొల్పారు.

Also Read : KG Tomato 200 : కిలో టమాటా 200 మాత్రమే.. ఎక్కడంటే ?

Exit mobile version