Chandrababu: చంద్రబాబు ఇచ్చిన హామీపై యాజ్ యాత్రికుల ఆశలు

చంద్రబాబు స్వీకారోత్సవానికి ముందు సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తుంది. హజ్ సీజన్ కావడంతో ముస్లిం ప్రజలు హజ్ యాత్రకు వెళ్తుంటారు. అయితే ఖర్చుతో కూడుకున్నది కావడంతో పేద ముస్లిమ్ ప్రజలు హజ్ యాత్రను వాయిదా వేసుకుంటుంటారు. అయితే ఎన్నికల సమయంలో చంద్రబాబు ముస్లిం సోదరులను ఉద్దేశించి ఓ హామీ ఇచ్చారు

Chandrababu: ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర ప్రముఖ నేతలు హాజరు కానున్నారు. ఇదిలా ఉండగా చంద్రబాబు స్వీకారోత్సవానికి ముందు సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తుంది. హజ్ సీజన్ కావడంతో ముస్లిం ప్రజలు హజ్ యాత్రకు వెళ్తుంటారు. అయితే ఖర్చుతో కూడుకున్నది కావడంతో పేద ముస్లిమ్ ప్రజలు హజ్ యాత్రను వాయిదా వేసుకుంటుంటారు. అయితే ఎన్నికల సమయంలో చంద్రబాబు ముస్లిం సోదరులను ఉద్దేశించి ఓ హామీ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ముస్లిం మైనారిటీలను ఉద్దేశించి ప్రసంగిస్తూ మక్కా యాత్రకు వెళ్లే ముస్లింలకు హజ్ కోసం సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌డిఎ అధికారంలోకి వచ్చిన వెంటనే హజ్ యాత్రలో మక్కాను సందర్శించే ప్రతి ముస్లింకు రూ. 1 లక్ష ఆర్థిక సహాయం అందించబడుతుంది అని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే జూన్ 14 శుక్రవారం నుండి హజ్ ప్రారంభం అవుతుంది. దీంతో చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రస్తుతాం చర్చనీయాంశంగా మారింది. మైనారిటీలకు ఇచ్చిన వాగ్దానాలతో పాటు, ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన పార్టీ వాగ్దానం చేసిన “సూపర్ సిక్స్” ను నెరవేర్చాలని కోరుతున్నారు..

చంద్రబాబుకు ఆర్థిక సవాళ్లు ఎదురు కానున్నట్టుగా తెలుస్తుంది. జూలై 1 నాటికి దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారులకు సామాజిక పింఛన్‌లను పంపిణీ చేయడానికి చంద్రబాబుకు రూ. 4,500 కోట్లు అవసరం. ఇక జులై ఆర్థిక అవసరాలను తీర్చేందుకు కొత్త టీడీపీ ప్రభుత్వం రూ. 10,000 కోట్లకు పైగా నిధులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. జీతాలు, పెన్షన్లు, రుణాల చెల్లింపులు మరియు వడ్డీల అవసరాలను తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా దాదాపు రూ. 1.30 లక్షల కోట్ల నిబద్ధతతో ఖర్చు చేస్తోంది. అదేవిధంగా మేనిఫెస్టోలో భాగంగా ప్రభుత్వం నిర్వహించే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చింది. పాఠశాలకు వెళ్లే ప్రతి చిన్నారికి ఏడాదికి రూ.15వేలు ఇస్తామని టీడీపీ హామీ ఇచ్చింది.ప్రతి ఇంటికి సంవత్సరానికి మూడు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు మరియు ప్రతి రైతుకు రూ. 20,000 వార్షిక ఆర్థిక సహాయం, ఇతరులకు కూడా పార్టీ హామీ ఇచ్చింది.

Also Read: Chandrababu : సంకీర్ణ మంత్రివర్గ ఏర్పాటుకు చంద్రబాబు కసరత్తు