Site icon HashtagU Telugu

Nara Lokesh : స్కూళ్లకు రూ.100 కోట్ల నిధులు – లోకేష్

Minister Nara Lokesh

Minister Nara Lokesh

సమస్యల వలయాలుగా మారిన స్కూళ్ల నిర్వహణ కోసం రూ. 100 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి లోకేశ్ (Nara Lokesh) వెల్లడించారు. కరోనా తర్వాత ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన కాంపోజిట్ గ్రాంట్లను, మండల రిసోర్సు కేంద్రాల నిర్వహణ నిధుల కొరత నెలకుంది. నిధులలేమితో పాఠ‌శాల‌లు స‌మ‌స్య‌ల వ‌ల‌యాలుగా మారిన దుస్థితి రాష్ట్ర‌వ్యాప్తంగా ఉంద‌ని గుర్తించిన విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ నిధుల విడుద‌ల‌కు మార్గం సుగ‌మం చేశారు.

2024-25 సంవత్సరానికి 855 పీఎం శ్రీ స్కూళ్లకు రూ. 8.63 కోట్లు, కేజీబీవీ స్కూళ్లకు రూ. 35.16 కోట్లు, మండల రిసోర్స్ కేంద్రాలకు రూ. 8.82కోట్లు, అలాగే మిగిలిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూళ్లకు రూ. 51.90 కోట్లు విడుదల చేశారు. కాగా ఈ 100 కోట్ల నిధులను ఆయా పాఠపాలలో సుద్దముక్కలు, డస్టర్స్, చార్టులు, విద్యా సామాగ్రి, రిజిస్టర్లు, రికార్డులు, క్రీడా సామగ్రి, ఇంటర్నెట్, తాగునీరు వంటి కనీస అవసరాలకు ఈ నిధులను వాడుకోవచ్చని మంత్రి నారా లోకేష్ తెలిపారు.

Read Also : Young India Skill University : అదానీ రూ.100 కోట్ల విరాళంపై కేటీఆర్ విమర్శలు