Site icon HashtagU Telugu

Thalliki Vandanam : ఓ కుటుంబాన్ని లక్షాధికారిని చేసింది

Rs 1.56 Lakhs Under Talliki

Rs 1.56 Lakhs Under Talliki

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ఒకటైన ‘తల్లికి వందనం’ (Thalliki Vandanam) పథకం ద్వారా అన్నమయ్య జిల్లా కలకడ మండలంలో ఓ ఉమ్మడి కుటుంబానికి అదృష్టం కలిసి వచ్చింది. ఈ కుటుంబానికి చెందిన 12 మంది పిల్లలందరికీ ఈ పథకం వర్తించడంతో వారి ముగ్గురు తల్లుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.13,000 చొప్పున మొత్తం రూ.1,56,000 జమయ్యాయి. ప్రభుత్వ సహాయంతో కుటుంబానికి ఊహించని వరమొచ్చినట్టయింది. ఇంత పెద్ద మొత్తంలో అందుకోవడంతో ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Chopper Crash: హెలికాప్టర్ ప్రమాదం: ఉత్తరాఖండ్‌లో 7 మంది మృతి

ఈ పథకం లక్ష్యం విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడడం, తల్లుల పాత్రకు గౌరవం కల్పించడమే. ప్రభుత్వం ప్రతి విద్యా సంవత్సరానికి తల్లుల ఖాతాల్లో నేరుగా ఆర్థిక సహాయం జమ చేస్తోంది. దీనివల్ల పేద కుటుంబాల తల్లులు పిల్లల విద్యను నిర్భయంగా కొనసాగించగలుగుతున్నారు. అంతేకాదు, ఈ పథకం ద్వారా బాలికల డ్రాప్ అవుట్ రేటును తగ్గించేందుకు కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

ఇక ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా కొన్ని చోట్ల 4 నుంచి 5 మంది పిల్లలున్న తల్లులకు రూ.5.52 లక్షలు, రూ.5.65 లక్షల వరకు డబ్బు జమైన సందర్భాలు నమోదయ్యాయి. ఈ విధంగా “తల్లికి వందనం” పథకం వల్ల ఒక్కొక్క కుటుంబం లక్షాధికారిగా మారుతూ, తమ పిల్లల భవిష్యత్తు పై ఆశలు పునరుద్ది చెందుతున్నాయి. పథకం అమలుపై ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది.