Site icon HashtagU Telugu

RRR torture : టార్చ‌ర్ పై జ‌గ‌న్ కు `లైవ్` షాక్ , రంగంలోకి సీబీఐ

Rrr Torture

Rrr Torture

క‌స్టోడియ‌ల్ టార్చ‌ర్ ను(RRR torture) భ‌రించిన వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌క్రిష్ణంరాజు ఎట్ట‌కేల‌కు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jagan)మీద తొలి విజ‌యం సాధించారు. ఆయ‌న్ను క‌స్ట‌డీకి తీసుకున్న స‌మ‌యంలో కాల్ డేటా తీస్తే భ‌యంక‌ర నిజాలు భ‌య‌ప‌డే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న న‌మ్ముతున్నారు. ఆ రోజు ముగ్గురు ముసుగువీరులు లైవ్ లో సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి చూపిస్తూ టార్చ‌ర్ పెట్టార‌ని ర‌ఘురామ‌కు ఉన్న అనుమానం. ఆ విష‌యాన్ని ప‌లుమార్లు ఆయ‌న చెప్పారు. అదే అనుమానం మీద కాల్ డేటాను ప‌రిశీలించాల‌ని కోర్టును అభ్య‌ర్థించారు. ఆ మేర‌కు ఏపీ హైకోర్టు సీబీఐకి ఉత్వ‌ర్వులు ఇవ్వ‌డంతో టార్చ‌ర్ స‌మ‌యంలో జ‌రిగిన త‌తంగం అంతా బ‌య‌ట‌ప‌డనుంది.

క‌స్టోడియ‌ల్ టార్చ‌ర్ ను భ‌రించిన వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌క్రిష్ణంరాజు(RRR torture) 

ఎంపీ రఘురామను (RRR torture) అదుపులోకి తీసుకున్న సమయంలో కాల్‌ డేటాను స్వాధీనం చేసుకొని భద్ర పరచాలని, కాల్ డేటాను వెంటనే సేకరించాలని సీబీఐకు ఏపీ హైకోర్టు ఆదేశించింది. తన కస్టోడియల్ టార్చర్‌పై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ ఏపీ హైకోర్టులో ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్ వేశారు. శుక్రవారం ఆ పిటిష‌న్ విచారణకు వచ్చింది. టెలికం నిబంధనల ప్రకారం రెండు సంవత్సరాలు మాత్రమే కాల్ డేటా(call data) ఉంచుతారని రఘురామ తరఫు న్యాయవాది నౌమీన్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాల్ డేటాను ప్రిజర్వ్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని అభ్యర్దించారు.

కాల్ డేటాను సేకరించి భద్రపరచాలని సీబీఐని న్యాయస్థానం ఆదేశిస్తూ

సీబీఐ తరపున అడిషనల్ సోలిసిటర్ జనరల్ హరినాధ్ వాదనలు వినిపించారు. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ సిఐడీ వద్ద ఉందని, అందువల్ల కాల్ డేటాను సీఐడీ అధికారులే సేకరించాలని అన్నారు. పిటీషనర్ ఆరోపణలే సిఐడీ మీద అయితే… అదే సంస్థను కాల్ డేటా ఎలా సేకరించమంటారని హైకోర్టు ప్రశ్నించింది. కాగా ఈ కేసులో సీఐడీ ఇంప్లీడ్ పిటీషన్ వేసింది. కాల్ డేటా సేకరించమనడం చట్టవిరుద్దమని సీఐడీ తరపు న్యాయవాది అన్నారు. సీఐడీ ఇంప్లీడ్ పిటీషన్‌ను ఇంకా అనుమతించలేదని హైకోర్టు పేర్కొంది. దీంతో సీబీఐకు ‘ఇవ్వాలా…? లేదా..?’ అనేది కోర్టు ఇంకా నిర్ణయించలేదని, ఈ కేసులో కాల్ డేటా కీలకమని న్యాయవాది నౌమీన్ వాదించారు. కాల్ డేటాను సేకరించి భద్రపరచాలని సీబీఐని(CBI) న్యాయస్థానం ఆదేశిస్తూ తదుపరి విచారణను వేసవి సెలవుల అనంతరానికి వాయిదా వేసింది.

Also Read : Rayudu political entry : అంబ‌టి రాయుడు YCP గుంటూరు గ్రౌండ్లోకి..?

హైకోర్టు ఆదేశాల మేర‌కు సీబీఐ రంగంలోకి దిగ‌నుంది. కాల్ డేటాను (Call data)సేక‌రించ‌నుంది. అదే జ‌రిగితే, సీఐడీ అధికారులు చేసిన దాష్టీకం బ‌య‌ట‌ప‌డుతుంద‌ని ర‌ఘురామ‌క్రిష్ణంరాజు (RRR torture)చెబుతున్నారు. ఆ రోజున టార్చ‌ర్ పెట్టిన విష‌యాన్ని పూస‌గుచ్చిన‌ట్టు ఆయ‌న చెబుతూ ముసుగువేసి పిడిగుద్దులు గుద్దార‌ని ఆయ‌న చేస్తోన్న ఆరోప‌ణ‌. ఆ స‌మ‌యంలో కాళ్ల మీద తొక్కుతూ టార్చ‌ర్ పెట్టార‌ని న్యాయ‌స్థానాల్లో చెప్పారు. వీడియో కాల్ ద్వారా లైవ్ లో(vedio call live) అంతా ఎవ‌రికో చూపించారంటూ అవ‌త‌లి వైపు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (jagan)అంటూ అనుమానించారు. అంతేకాదు, ముగ్గురు ముసుగు వీరుల్లో సీఎం స‌ల‌హాదారుగా ఉన్న ఒక‌రు ఉన్నార‌ని కూడా ప్రైవేటుగా చెబుతున్నారు. అదంతా బ‌య‌ట‌కు రావాలంటే కాల్ డేటా ముఖ్యం. అందుకే, టార్చ‌ర్ మీద న్యాయ‌స్థానాల్లో పోరాడిన ర‌ఘురామ తొలి విజ‌యం సాధించార‌ని చెప్పొచ్చు.

Also Read : Balineni : జ‌గ‌న్ పై `బాలినేని`ప‌వ‌రిజం, YCPకి బై?