RRR Clarity: కోర్టును ఆశ్రయించం.. సీఎం జగన్ కు విన్నవించుకుంటాం!

జగన్ ప్రభుత్వం సినిమా టికెట్స్ విషయమై ‘ఆన్ లైన్ టికెటింగ్ విధానం’ తీసుకొచ్చిన విషయం విధితమే. అయితే ఈ తరహా విధానం వల్ల సినిమా టికెట్ల రేట్లు తగ్గనున్నాయి.

  • Written By:
  • Updated On - November 15, 2021 / 12:56 PM IST

జగన్ ప్రభుత్వం సినిమా టికెట్స్ విషయమై ‘ఆన్ లైన్ టికెటింగ్ విధానం’ తీసుకొచ్చిన విషయం విధితమే. అయితే ఈ తరహా విధానం వల్ల సినిమా టికెట్ల రేట్లు తగ్గనున్నాయి. అయితే థియేటర్లలో టిక్కెట్ ధరల తగ్గింపు గురించి మాట్లాడటానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని సంప్రదించాలని యోచిస్తున్నట్లు ఆర్ఆర్ఆర్ చిత్ర నిర్మాతలు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ నిర్మాతలు, ఇతర నిర్మాతలు సినిమా టిక్కెట్ ధరలను పెంచాలని కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు పుకార్లు వ్యాపించాయి. అయితే తాము కోర్టును ఆశ్రయించబోమని, అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి తమ అభ్యర్థనను తెలియజేస్తామని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ స్పష్టంచేసింది.

RRR నిర్మాతలు కొత్త పోస్టర్లు, ప్రోమో వీడియోలను వరుస పెట్టి విడుదల చేస్తున్నారు. ఆర్ఆర్ ఆర్ ఆప్ డేట్స్ ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఆర్ఆర్ఆర్ టిక్కెట్ ధరలను పెంచాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు నివేదికలు సూచిస్తున్నాయి. దీంతో ఎక్కువ టిక్కెట్ ధరలు ఉన్న థియేటర్లలో సినిమాను విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ నిర్మాతలు కోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నారని ప్రచారం జరిగింది.

అయితే ఆర్‌ఆర్‌ఆర్ ప్రొడక్షన్ హౌస్, డివివి ఎంటర్‌టైన్‌మెంట్ పై వస్తున్న రూమర్స్ పై స్పందించారు. “టికెట్ ధరల తగ్గింపు మా సినిమాపై విపరీతమైన ప్రభావం చూపుతుంది. కానీ #RRRMovie టికెట్ల ధరల విషయమై మేము కోర్టుకు వెళ్లే ఉద్దేశ్యం లేదు. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని సంప్రదించి మా పరిస్థితిని వివరించడానికి ప్రయత్నిస్తున్నాము. స్నేహపూర్వక పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నాం’’ అని అన్నారు.

450 కోట్ల భారీ బడ్జెట్‌తో RRRని నిర్మిస్తున్నారు. టికెట్ ధరలను పెంచి మంచి లాభాలు పొందాలనే ఆలోచనలో నిర్మాత ఉన్నట్లు సమాచారం. అయితే ఆర్ఆర్ఆర్ నిర్మాతలు టిక్కెట్ ధర మొదటి వారం రూ. 500 వరకు పెంచే అవకాశాలున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్ ప్రధాన పాత్రల్లో నటించిన పీరియాడికల్ ఫిల్మ్. జనవరి 7, 2022న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో ఒలివియా మోరిస్, రే స్టీవెన్‌సన్, అలిసన్ డూడీ మరియు సముద్రఖని సహాయక పాత్రల్లో నటిస్తున్నారు.