వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా (RK Roja) చుట్టూ ప్రస్తుతం రాజకీయ చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఎన్నికలలో ఓటమి తర్వాత రాజకీయంగా సైలెంట్ గా మారిన రోజా.. ఇటీవల ఓ కీలక టీడీపీ మంత్రి(TDP Minister)తో రహస్యంగా సమావేశమయ్యారన్న వార్తలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. గతంలో టీడీపీలో ఉండి వైసీపీలో కీలక నేతగా ఎదిగిన రోజా, తిరిగి పాత పరిచయాలను వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు విన్పిస్తున్నాయి. విజయవాడలో రాయలసీమకు చెందిన ఆ మంత్రి తో జరిగిన రహస్య భేటీ వల్ల రెండు పార్టీల్లోనూ కలవరం మొదలైంది.
Greenfield Highway : అమరావతి-హైదరాబాద్ గ్రీన్‌ఫీల్డ్ హైవేకి కేంద్రం అనుమతి
మంత్రిగా ఉన్నప్పుడు “ఆడుదాం ఆంధ్ర” పేరిట జరిగిన అక్రమాలపై రోజాపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. మంత్రి రాంప్రసాద్ ఇప్పటికే ఈ విషయంలో విచారణ జరపనున్నట్టు ప్రకటించారు. రెడ్ బుక్‌లో ఆమె పేరు ఉన్నందున అరెస్ట్ అవడం ఖాయమని పలువురు అంటున్నారు. ఇదే నేపథ్యంలో రోజా తన అరెస్ట్ తప్పించుకునేందుకు లాబీయింగ్ ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. టీడీపీలో ఉన్న పాత పరిచయాలను వాడుకోవాలన్న ఆమె ప్రయత్నం పార్టీ శ్రేణుల్లో అసంతృప్తిని కలిగిస్తోంది. ఈ వ్యవహారం చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో ఆ మంత్రిని పిలిపించి ప్రశ్నించే అవకాశం ఉందని సమాచారం.
Alekhya Chitti Pickles : దెబ్బకు హాస్పటల్ పాలైన ‘అలేఖ్య చిట్టి పికిల్స్’
రోజా తీరుపై వైసీపీలోనూ విమర్శలు వస్తున్నాయి. మాజీ మంత్రులు కేసులతో పోరాడుతున్న వేళ, రోజా మాత్రం రాజీ మార్గం ఎంచుకోవడం పార్టీకి తలవొంపుగా మారుతుందంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన విమర్శలు, వ్యాఖ్యలు ఇప్పుడిప్పుడే మరిచిపోతున్నట్టు టీడీపీ శ్రేణులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏదేమైనా, కేసుల భయంతో రోజా రాజకీయ అనుభవాన్ని వినియోగించుకొని ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఈ పరిణామాలు రోజా రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.