ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh Politics) వైసీపీ నేత రోజా, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (Roja Vs Sharmila) మధ్య మాటల యుద్ధం ముదిరింది. టీడీపీకి షర్మిల మద్దతిస్తున్నారని రోజా తీవ్ర ఆరోపణలు చేశారు. బాలకృష్ణ ఇంటి నుంచే ఐటిడీపీ కార్యకర్తలు షర్మిలను ట్రోల్ చేసినప్పుడు ఏడ్చి ఫిర్యాదు చేసిన ఆమె, ఇప్పుడు చంద్రబాబుకు మద్దతు ఇవ్వడమంటే ఎటువంటి విలువలతో ఉన్నారో తేలిపోతుందన్నారు. కొమ్మినేని అరెస్ట్, “సాక్షి” ఆఫీసులపై దాడి, మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలపై షర్మిల, రేణుకా చౌదరి స్పందించకపోయినప్పటికీ జగన్, భారతి పేరు వస్తే ఒక్కసారిగా రెచ్చిపోతున్నారంటూ విమర్శించారు.
Austria : పాఠశాలలో కాల్పులు కలకలం..11మంది మృతి!
ఈ వ్యాఖ్యలపై షర్మిల తీవ్రంగా స్పందించారు. వైసీపీ నేతలు తనపై వ్యక్తిగత దుర్భాషలు వాడారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రోజా సహా పలువురు వైసీపీ నాయకులు తనను అక్రమ సంబంధాల అంటకట్టి, హేళన చేశారని, తన సొంత రక్త సంబంధమే తాను ఎవరో అనే విధంగా ప్రచారం చేయడం బాధాకరమన్నారు. ముఖ్యంగా తాను వైఎస్సార్‌కు పుట్టలేదని, విజయమ్మకు అక్రమ సంతానమని చేసిన ప్రచారాన్ని గుర్తు చేస్తూ, “నాపై అపనిందలు వేసిన వాళ్లే నేడు నీతులు చెప్పడం విడ్డురంగా ఉందని అన్నారు.
చంద్రబాబుకు తాను మద్దతిచ్చే ప్రసక్తి లేదని స్పష్టంగా పేర్కొన్న షర్మిల.. “నేను YSR బిడ్డని, ఆయన సిద్ధాంతాలే నా మార్గదర్శకాలు. టీడీపీకి అనుకూలంగా మద్దతు ఇచ్చే అవసరం నాకు లేదు. వైసీపీ చేసిన హింసను ఎన్ని విమర్శలు చేసినా తగ్గించలేరు. కానీ వ్యక్తిగత జీవితాలను రాజకీయానికి ప్రయోజనంగా మలచడం అత్యంత బాధాకరం” అంటూ తన ఆవేదనను పంచుకున్నారు. ఇది నిత్యం మారుతున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణంలో తీవ్ర చర్చకు దారితీస్తుంది.