Site icon HashtagU Telugu

Rushikonda Palace : అత్యంత నాణ్యతతో భవనాలు నిర్మించడం తప్పా..? – మాజీ మంత్రి రోజా

Rushikonda Palace

Rushikonda Palace

విశాఖలోని రుషికొండ ప్యాలెస్‌ (Rushikonda Palace) ఫై ఇప్పుడు టీడీపీ vs వైసీపీ (TDP vs YCP) వార్ నడుస్తుంది. రుషికొండపై జగన్ సర్కార్ నిర్మించినవి భవనాలు కాదు ఓ రాజమహల్… ఆ భవనాలను చూసిన ఎవ్వరయినా ఇదే అంటారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ మహల్ గురించే హాట్ చర్చ నడుస్తుంది. జగన్ సర్కార్ అత్యంత విలాసవంతంగా నిర్మించిన ఈ భవనాల తలుపులు ఇటీవల తెరుచుకున్నాయి. కూటమి ప్రభుత్వ ఏర్పాటు తర్వాత రుషికొండపై ఆంక్షలు తొలగిపోయాయి. దీంతో రాజమహాల్ ను పోలిన భవనాల పోటోలు, వీడియోలు భయటకు వచ్చాయి. వాటిని చూసి సామాన్య ప్రజలు నోరేళ్లబెడుతున్నారు.

జగన్ తన విలాసాల కోసమే రుషికొండపై ఇంతటి లగ్జరీ భవనాలను నిర్మించుకున్నారని టిడిపి, జనసేన, బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. ప్రజాధనంతో ఏకంగా రాజభవనాన్నే నిర్మించుకున్నారని మండిపడుతున్నారు. ఇక కూటమి పార్టీల నేతల వ్యాఖ్యలపై మాజీ మంత్రి రోజా (RK Roja) ట్విట్టర్ (X) వేదికగా స్పందించారు.

“విశాఖ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలనే సంక‌ల్పంతో మా ప్రభుత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో భవనం నిర్మించడం తప్పా? వర్షానికి కారిపోయే అసెంబ్లీని, సచివాలయాన్ని కట్టినవాళ్లకు అత్యంత నాణ్యతతో రుషికొండలో భవనాలు నిర్మించడం చూసి ఓర్వలేకపోవడం సమంజసమేనా? 2021లోనే కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు సమగ్ర వివరాలిచ్చి రుషికొండ నిర్మాణాలు చేపట్టిన మాట వాస్తవం కాదా?

61 ఎకరాల్లో 9.88 ఎకరాల్లోనే ఈ నిర్మాణాలు చేపట్టాం. ఇందులో అక్రమం ఎక్కడుంది? విశాఖ ఖ్యాతిని ఇనుమడించేలా, రాష్ట్రానికే తలమానికంగా భవనాలు నిర్మించడం కూడా నేరమేనా? ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా ఫైవ్ స్టార్ వసతులతో నిర్మాణాలు చేయడం తప్పేనా? ఏడు బ్లాకుల్లో ఏమేమీ నిర్మాణాలు, వసతులు ఉంటాయో గతంలోనే టెండర్ డాక్యుమెంట్లలో పొందుపర్చిన మాట వాస్తవం కాదా?

హైకోర్టుకు ఈ నిర్మాణాలపై ప్రతి దశలోనూ అధికారులు నివేదిక సమర్పించిన వాస్తవం దాచేస్తే దాగుతుందా? ఇన్నాళ్లూ ఇవి జగనన్న సొంత భవనాలని ప్రచారం చేసిన వాళ్లు ఇప్పటికైనా అవి ప్రభుత్వ భవనాలని అంగీకరిస్తారా? లేదా? హైదరాబాద్‌లో సొంతిల్లు కట్టుకున్నారని, హయత్ హోటల్ లో లక్షలకు లక్షలు ప్రజల డబ్బులను అద్దెలు చెల్లించిన వాళ్లా… ఈరోజు విమర్శలు చేసేది?

లేక్ వ్యూ గెస్ట్‌ హౌస్, పాత సచివాలయం ఎల్ బ్లాక్, హెచ్ బ్లాక్‌ల‌లో 40 కోట్లతో హంగులు అద్ది రాత్రికి రాత్రి వాటిని వదిలేసి విజయవాడ వచ్చేసిన వాళ్లా ఈరోజు విమర్శలు చేసేది? మా జ‌గ‌న‌న్నపై, మాపైన ఎంత వ్యక్తిత్వ హననం చేసినా రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటంలో వైసీపీ వెన్ను చూపేది లేదు. వెనకడుగు వేసేది లేదు. జై జగన్..!” అంటూ రోజా ట్వీట్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

రోజా ట్వీట్ కు నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ కౌంటర్ ఇచ్చారు. నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు అన్నట్లుంది మీ యవ్వారం… ముందు ఆ ప్యాలెస్ కు..మీ బెంజ్ కారుకు ఉన్న సంబంధం ఎంటో బయట పెట్టండి మాజీ మంత్రి గారు..ట్వీట్ చేసారు.

Read Also : Kane Williamson: టీ20 ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన.. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విలియమ్సన్‌..?