Site icon HashtagU Telugu

RK Roja: రజినీపై ఫైర్ అయిన మంత్రి రోజా

Rk Roja

Rk Roja

RK Roja: సూపర్ స్టార్ రజినీకాంత్ పై మండిపడ్డారు నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా. దివంగత ఎన్టీఆర్ 100వ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఏపీని సందర్శించారు రజినీకాంత్. ఈ సందర్భంగా ఆయన రాజకీయంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ ని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సీఎం అవుతారంటూ జోస్యం చెప్పారు. అలాగే సీనియర్ ఎన్టీఆర్ యుగపురుషుడు అంటూ కొనియాడారు.

రజినీకాంత్ వ్యాఖ్యలపై మంత్రి రోజా స్పందించారు. చంద్రబాబు విజన్ కారణంగా గత ఎన్నికల్లో 23 సీట్లకి పడిపోయారని గుర్తు చేశారు. ఇక్కడ రాజకీయాలపై అవగాహనా లేకుండా రజినీకాంత్ మాట్లాడారన్నారు. చంద్రబాబు ఎన్టీఆర్ ని ఏ విధంగా అవమానించారో ఆ వీడియోలు రజినీకి పంపిస్తాను అని చెప్పారు. ఆ నాడు అసెంబీలో ఏం జరిగిందో రజినీకాంత్ తెలుసుకోవాలని సూచించారు. సీఎం కుర్చీ కోసం చంద్రబాబు ఎన్టీఆర్ కార్టూన్లు తయారు చేయించి దారుణంగా అవమానించినట్టు రోజా తెలిపారు. హైదరాబాద్ నగరం చంద్రబాబు సీఎం కాకముందే అభివృద్ధి చెందింది. విదేశాల్లో తెలుగు ప్రజలు ఉద్యోగాలు సంపాదిస్తున్నారు అంటే అది కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి ఫీ రియంబర్స్మెంట్ మాత్రమే కారణమని కొనియాడారు.

ఎన్టీఆర్ ని యుగపురుషుడు అన్న వారు ఇన్నేళ్ళలో ఆయనకు ఎందుకు భారతరత్న ఇచ్చించలేదని ప్రశ్నించారు. విషయం తెలియకుండా మాట్లాడి తెలుగు ప్రజలకు దూరం కావొద్దు అంటూ రజినీకి సూచించారు ఆమె. చంద్రబాబుని ప్రశంసించి తెలుగు ప్రజలు మనోభావాలు దెబ్బతీశారు. రజినీకాంత్ మాటల వల్ల ఎన్టీఆర్ కూడా బాధపడతాడు అంటూ మంత్రి రోజా అన్నారు.

Read More: Ask KTR : మంత్రి కేటీఆర్ ఎక్క‌డ‌? మౌనిక మ‌ర‌ణ పాపం ఎవ‌రిది?

Exit mobile version