Site icon HashtagU Telugu

Roja Selvamani : ఆర్కే రోజా కాదు..మినిస్టర్ రోజా..!!

Mla Roja

Mla Roja

అదృష్టం పడితే ఆరు నూరు అవుతుంది…అంటే ఇదేనేమో. ఆమె చేసిన ఎన్నో నోములు..ఎన్నో పూజలు…ఇవన్నీ ఫలించాయి. ఆర్కే రోజా చేసిన పూజలు అన్నీ ఇన్నీ కావు. ఎక్కని కొండలేదు…మొక్కని దైవం లేదు. ఇంకా చెప్పాలంటే…గత కొన్నాళ్లుగా ఆలయాలే చుట్టే తిరుగుతున్నారు. స్వామీజీలను కలిసి దీవెనలు తీసుకున్నారు. అంతేకాదు తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంతో షురూ చేసి…విజయవాడ కనకదుర్గమ్మ, జొన్నవాడ కామాక్షమ్మ శ్రీ కాళహస్తీశ్వరస్వామి, శ్రీశైలం మల్లికార్జున స్వామి, తమిళనాడులోని ప్రసిద్ధ ఆలయాలు దర్శించుకున్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

కేవలం పూజలే కాదు..యాగాలు చేశారు. ఇలా ఎన్నో కష్టాలను ఓర్చి మరీ చేసిన పూజలు…మొక్కిన మొక్కులు మొత్తానికి ఫలించాయి. ఆమె నోచిన నోములు ఆమెను అమాత్య కుర్చీలో కూర్చునేలా చేయబోతున్నాయి. నిజంగా మినిస్టర్ రోజా అనిపించుకోవాలన్నది ఆమె కోరిక. 2019లోనే రోజా కోరిక తీరుతుందనుకున్నారు. కానీ ఆ కోరిక ఇప్పుడు నిజం కాబోతుంది. ఒక్కోసారి సుదీర్ఘ నీరీక్షణ కూడా మంచి ఫలితాలు ఇస్తుందనడానికి ఉదాహారణ ఇదే.