Site icon HashtagU Telugu

Roja Nagari Clash : ఛీ..ఛీ..రోజా! జ‌గ‌న్ ఎదుటే శాంతి జ‌ల‌క్!

Roja Nagari Clash

Roja Nagari Clash

చిత్తూరు జిల్లా న‌గ‌రి వెళ్లిన సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలోనే ఈడిగ మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ శాంతి, ఎమ్మెల్యే రోజా మ‌ధ్య (Roja Nagari Clash)గ్యాప్ బ‌య‌ట‌ప‌డింది. వాళ్లిద్ద‌రి చేతులు క‌లిపేందుకు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌య‌త్నించారు. కానీ, రోజాతో చేతులు క‌ల‌ప‌డానికి శాంతి ఇష్ట‌ప‌డ‌లేదు. ఇరువురి చేతుల‌ను ప‌ట్టుకుని ఆయ‌న‌ క‌ల‌పాల‌ని ప్ర‌య‌త్నించారు. కుడి చేత్తో శాంతి, ఎడ‌మ చేత్తో రోజా చేతుల‌ను ప‌ట్టుకున్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వాళ్లిద్ద‌రి చేతుల్లో చేతులు వేయించాల‌ని చేసిన ప్ర‌య‌త్నం రెప్ప‌పాటులో కెమెరాకు చిక్కింది. ఈ దృశ్యాన్ని చూస్తే శాంతి, రోజా మ‌ధ్య రాజ‌కీయ‌ప‌ర‌మైన గ్యాప్ ఎంత ఉందో స్ప‌ష్టం అవుతోంది.

మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ శాంతి, ఎమ్మెల్యే రోజా మ‌ధ్య గ్యాప్(Roja Nagari Clash)

రెండుసార్లు వరుస‌గా ఎమ్మెల్యేగా గెలిచిన రోజా గ్రాఫ్ ప్ర‌స్తుతం న‌గ‌రిలో డౌన్లో ఉంద‌ని స‌ర్వేల సారాంశం. ఆ క్ర‌మంలో ఈసారి టిక్కెట్ ఆమెకు   ఇవ్వ‌ర‌ని ప్ర‌చారం న‌డుస్తోంది. అంతేకాదు, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో రోజా వ‌ర్సెస్ ఈడిగ మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ శాంతి మ‌ధ్య రాజ‌కీయ ర‌గ‌డ(Roja Nagari Clash) పెద్ద ఎత్తున న‌డిచింది. స్థానికంగా ఉండే ఎంపీపీలు, జ‌డ్పీటీసీలు మోజార్టీ రోజాకు వ్య‌తిరేకంగా ఉన్నారు. ప‌లుమార్లు బాహాబాహికి కూడా ఇరువ‌ర్గాలు దిగిన సంద‌ర్భం ఉంది. రెండుగా చీలిపోయిన వైసీపీ గ్రూప్ లు ఎవ‌రి ప్రోగ్రామ్ ల‌ను వాళ్లు చేసుకుంటున్నారు. మంత్రి రోజాకు ఆహ్వానం లేకుండా ప‌లు కార్య‌క్ర‌మాల‌ను లోకల్ లీడ‌ర్లు చేసుకున్న దాఖ‌లాలు అనేకం. ఆ క్ర‌మంలో ప‌లుమార్లు తాడేపల్లి కేంద్రంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో పంచాయ‌తీ జ‌రిగింది. అయిన‌ప్ప‌టికి ఇరు వ‌ర్గాల మ‌ధ్య పోరు మాత్రం ఆగ‌లేదు.

పెద్దిరెడ్డి, మంత్రి రోజా మధ్య ప్ర‌చ్ఛ‌న్న‌యుద్ధం

జ‌గ‌న‌న్న విద్యాదీవెన కార్య‌క్రమంలో భాగంగా సోమ‌వారం బ‌ట‌న్ నొక్కే కార్య‌క్రమానికి జ‌గ‌న్మోహన్ రెడ్డి న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్లారు. ఆ సంద‌ర్భంగా ఇరు వ‌ర్గాల మ‌ధ్య ఉన్న గ్రూప్ విభేదాల‌ను (Roja Nagari Clash)స‌మ‌సిపోయేలా చేయ‌డానికి ప్ర‌య‌త్నించారు. ఆ సంద‌ర్భంగా ప‌క్క‌నే మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి కూడా ఉన్నారు. వాస్త‌వంగా పెద్దిరెడ్డి, మంత్రి రోజా మధ్య ప్ర‌చ్ఛ‌న్న‌యుద్ధం జ‌రుగుతోంది. మంత్రి రోజాకు వ్య‌తిరేకంగా ప‌నిచేసే వాళ్ల‌కు పెద్దిరెడ్డి అండ ఉంద‌ని స‌ర్వ‌త్రా తెలిసిందే. కానీ, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మాత్రం గ్రూపుల్లేకుండా చేయాల‌ని ప్ర‌య‌త్నం చేయ‌డం గ‌మ‌నార్హం.

Also Read : YCP District Presidents : జ‌గ‌న్ ఎన్నిక‌ల టీమ్ ఇదే.!  

ఫైర్ బ్రాండ్ గా పేరొంద‌ని రోజా ప్ర‌త్య‌ర్థుల‌ను బ‌ల‌హీన‌ప‌రిచేలా ప‌నిచేస్తున్నార‌ని తొలి నుంచి విమ‌ర్శ‌లు ఉన్నాయి. ప్ర‌త్యేకించి తెలుగుదేశం పార్టీ నుంచి ఆమెతో వ‌చ్చిన వాళ్ల‌ను ప్రోత్స‌హిస్తున్నార‌ని పూర్వం నుంచి వైసీపీలో ఉన్న క్యాడ‌ర్ అసంతృప్తిగా ఉంది. రెండోసారి ఎమ్మెల్మే అయిన త‌రువాత రోజా మీద వ్య‌తిరేక‌త (Roja Nagari Clash) పెరిగింది. మంత్రి ప‌ద‌వి రాకుండా వ్య‌తిరేక గ్రూప్ ప్ర‌య‌త్నం చేసింది. కానీ, లాబీయింగ్ తో మంత్రి ప‌ద‌విని రోజా పొంద‌గలిగారు. అయిన‌ప్ప‌టికీ ఆమెకు ప్రాధాన్యం లేకుండా వ్య‌తిరేక గ్రూప్ ప‌నిచేస్తోంది. పైగా ఇటీవ‌ల జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేయించిన స‌ర్వేల్లోనూ ఆమె వెనుక‌బ‌డ్డాని తెలుస్తోంది. ఆ క్ర‌మంలో ఆమె భ‌ర్త సెల్వ‌మ‌ణికి ఈసారి బ‌రిలోకి దిగుతార‌ని స్థానికంగా ఉన్న టాక్‌. కానీ, ఈడిగ శాంతి కూడా ఈసారి న‌గ‌రి నుంచి పోటీ చేయాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇలా రెండు గ్రూప్ ల‌ను మ‌ధ్య ఉన్న గ్యాప్ ముగింపులేని క‌థ‌లా సాగుతోంది.

Also Read : Jagan Board : గోవిందా..హ‌ల లూయా.!TTD భాగోతం!!