Rishi Graph : జ‌గ‌న్ హిట్ లిస్ట్ లో రోజా? 52 మంది ఎమ్మెల్యేల‌కు టిక్కెట్ డౌట్‌!

క‌నీసం 52 మంది ఎమ్మెల్యేల‌ను మార్చేయాల‌ని,

  • Written By:
  • Publish Date - December 16, 2022 / 05:04 PM IST

ఒక్క‌సారి ఫిక్స్ అయితే ఇక జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వెన‌క్కు తగ్గ‌రు. ఆ విష‌యాన్ని వైసీపీ లీడ‌ర్లు ఎవ‌రైనా చెబుతారు. ఇప్పుడు క‌నీసం 52 మంది ఎమ్మెల్యేల‌ను(MLAs) మార్చేయాల‌ని ఫిక్స్ అయ్యార‌ట‌. అంటే, ఇక వాళ్లు వేరే దారి చూసుకోవ‌డమే. అందులో ప్ర‌ధానంగా మంత్రి రోజా(Roja) తో పాటు ముగ్గురు మంత్రులు కూడా ఉన్నార‌ని టాక్‌. గ్రాఫ్(Graph) ప‌డిపోయిన వాళ్ల‌కు టిక్కెట్ ఇచ్చేది లేద‌ని వైసీపీ శాశ్వ‌త అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తేల్చేశారు.

తాడేప‌ల్లి కేంద్రంగా ఎమ్మెల్యేల‌తో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రివ్యూ చేశారు. ఆ సంద‌ర్భ‌గా రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త రిషిరాజ్ సింగ్(Rishi Graph) ఇచ్చిన స‌ర్వేల‌ను బ‌య‌ట పెట్టార‌ట‌. ఆ స‌ర్వే ప్ర‌కారం గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మానికి దూరంగా ఉన్న వాళ్లు 32 మంది ఉన్నార‌ని తేల్చారు. క‌నీసం 10 రోజులు ఆ కార్య‌క్ర‌మంలో పాల్గొనాల‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇచ్చిన ఆదేశం. అంత త‌క్కువ రోజులు పాల్గొన్న ఎమ్మెల్యేలు 32 మంది ఉన్నార‌ని రిషి(Rishi) జాబితా బ‌య‌ట‌పెట్టింది.

52 మంది ఎమ్మెల్యేల‌కు

వార్డు, గ్రామ స‌చివాల‌యాల ప‌రిధిలో ప్ర‌తి రోజూ క‌నీసం ఆరు నుంచి ఎనిమిది గంట‌లు ఉండాల‌ని ఎమ్మెల్యేల‌కు ఇచ్చిన టార్గెట్‌. కానీ, రెండు నుంచి మూడు గంట‌లు మాత్ర‌మే గ‌డిపిన ఎమ్మెల్యేలు 20 మంది ఉన్నార‌ని చిట్టా త‌యారు అయింది. అంటే, 32 ప్ల‌స్ 20 మొత్తంగా 52 మంది ఎమ్మెల్యేల‌కు టిక్కెట్ మీద ఆశ‌లు వ‌దులుకోమ‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సంకేతాలు ఇచ్చేశారు.

`మ‌రోఛాన్స్` కోసం వ్యూహాల‌ను ర‌చిస్తోన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అభ్య‌ర్థుల ఎంపిక‌లో ఏ మాత్రం రాజీపడే అవ‌కాశం లేదు. వాళ్లు మంత్రులైన‌, సీనియ‌ర్లు అయినా స‌రే టిక్కెట్ లేదంటే లేదు. ఒక్కసారి చెబితే వంద‌సార్లు చెప్పిన‌ట్టే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మాట‌ల‌ను తీసుకోవాల‌ని పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది. మూడు నెల‌ల క్రితం ఎంపీలు, ఎమ్మెల్యేల‌తో ఆయ‌న భేటీ అయ్యారు. ఆ సంద‌ర్భంగా గ్రాఫ్ ప‌డిపోయిన వాళ్ల ను హెచ్చ‌రించారు. గ్రాఫ్ పెంచుకోవ‌డానికి అవ‌కాశం ఇస్తాన‌ని మూడు నెల‌లు గ‌డువు పెట్టారు. గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాన్ని రూపొందించి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లాల‌ని సూచించారు.

మ‌రో క్యాబినెట్

తొలి క్యాబినెట్ కూర్పు స‌మ‌యంలో చెప్పిన‌ట్టే రెండేళ్ల త‌రువాత మ‌రో క్యాబినెట్ ను ఏర్పాటు చేశారు. మూడోసారి కూడా క్యాబినెట్ కూర్పు ఉంటుంద‌ని సంకేతాలు ఇటీవ‌ల ఇచ్చారు. అంటే, ఇప్పుడున్న మంత్రుల గ్రాఫ్ కొంద‌రిది బాగాలేద‌ని ఆయ‌న భావించారు. ఆ జాబితాలో న‌లుగురు మంత్రులు ఉన్నార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. రెండు రోజుల క్రితం మంత్రుల స‌మావేశంలోనూ అవినీతి, అక్ర‌మాల గురించి ప్ర‌స్తావించారు. జాగ్ర‌త్త‌గా ఉండ‌క‌పోతే వేటు త‌ప్ప‌ద‌ని ప‌రోక్షంగా హెచ్చ‌రించారు. అంటే, ఎన్నిక‌ల టీమ్ ను ఏర్పాటు చేసుకోవ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సిద్ధం అవుతున్న‌ట్టు తెలుస్తోంది.

సంక్రాంతి త‌రువాత గ్రాఫ్(Graph) ప‌డిపోయిన ఎమ్మెల్యేల(MLAs) స్థానంలో కొత్త వాళ్ల‌ను క్షేత్ర‌స్థాయికి పంపే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌త్య‌ర్థి పార్టీ కంటే క‌నీసం 5 నుంచి 10 శాతం ఓటు బ్యాంకు గ్యాప్ ఉన్న జాబితాను రిషి(Rishi) త‌యారు చేశార‌ట‌. దాని ఆధారంగా సంక్రాంతి త‌రువాత సుమారు 52 మంది కొత్త ముఖాల‌ను నియోజ‌క‌వ‌ర్గాల‌కు పంపే అవ‌కాశం ఉంది. వాళ్ల‌కే టిక్కెట్ల ప్ర‌క‌టించ‌డానికి క‌స‌ర‌త్తు చేస్తున్నారని స‌మాచారం. ప్ర‌త్యేకించి న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ కంటే వైసీపీ బాగా వెనుక‌బ‌డి ఉంద‌ని తాడేప‌ల్లి వ‌ర్గాల్లోని టాక్‌. అందుకే , మంత్రి రోజా(Roja)కు బ‌దులుగా మ‌రొక‌రికి అక్క‌డ నుంచి అవ‌కాశం ఇవ్వ‌డానికి అధిష్టానం సిద్దం అయిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే రోజా(Roja)కు క్షేత్ర‌స్థాయిలో పోటీ చేస్తూ నియోక‌వ‌ర్గంలో ప‌నిచేస్తున్నార‌ని మంత్రి పెద్దిరెడ్డి వ‌ర్గీయులు చెబుతున్నారు. ఆమెతో పాటు న‌లుగురు మంత్రుల‌కు టిక్కెట్ ఈసారి ఎన్నిక‌ల్లో ఇచ్చే అవ‌కాశం లేద‌ని రిషి(Rishi) త‌యారు చేసిన జాబితా చెబుతుంద‌ని పార్టీ వ‌ర్గాల్లోని టాక్‌.

Chandrababu Naidu: మైనార్టీల వైపు చంద్రబాబు!