RK Roja : జగన్‌పై నమోదైన కేసును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా ఖండించారు. తప్పుడు ప్రచారం, ఫేక్ వీడియోలతో జగన్ పేరును మంటగలిపేందుకు పునరావృత ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. ఈ కుట్రల వెనుక నందమూరి కుటుంబం నేతలు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఉన్నారని ఆరోపణలు గుప్పించారు.
“జగన్‌పై ప్రజల్లో ఉన్న ఆదరణను తట్టుకోలేకే కుట్రలు, అక్రమ కేసులు కొనసాగుతున్నాయి. ఆయనపై ఒక ఫేక్ వీడియోను వదిలి భయపెట్టాలని చూస్తున్నారు. ఎస్పీ కూడా తొలుత వాహనం వల్ల కాదు అన్నారని, తర్వాత అదే అధికారులే వీడియో తీసి బయటపెట్టారు. ఇది పక్కా ప్లాన్. వీడియోను టెస్ట్ చేయాలంటే ఎక్కడికైనా పంపండి,” అంటూ రోజా స్పష్టం చేశారు.
“ఇంటెలిజెన్స్ శాఖ నాలుగు రోజులుగా నిద్రపోతుందా?” అంటూ ప్రశ్నించిన ఆమె, అసలు పోలీసుల దగ్గర లేని వీడియో బయటకు ఎలా వచ్చిందో అన్వేషించాలని డిమాండ్ చేశారు. ఈ ఫేక్ వీడియో వెనుక చంద్రబాబు, లోకేష్, పవన్ ఉన్నారని ఆమె అభిప్రాయపడ్డారు.
“జగన్ గుండెలేని నాయకుడు కాదు. ఒక వృద్ధుడు కింద పడి ఉన్నా చూసుకోకుండా వెళ్లే వ్యక్తి కాదు” అంటూ జగన్ పరిపాలన తీరును సమర్థించడమే కాకుండా, గతంలో చోటుచేసుకున్న పలు సంఘటనలతో ఇప్పుడు జరుగుతున్న ఆరోపణలను పోల్చారు.
“తిరుపతి, సింహాచలం, గోదావరి పుష్కరాల్లో జరిగిన మరణాలపై చంద్రబాబు, పవన్‌పై కేసులు పెట్టాలా?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక “గేమ్ ఛేంజర్” ఫంక్షన్‌లో ఇద్దరు మృతి చెందిన విషయాన్ని ప్రస్తావిస్తూ పవన్‌పై కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.
పి4 పథకం కింద ప్రభుత్వ ప్రధానులు, వారి భార్యలు మొదట తమ ఆస్తులను ప్రజలతో పంచుకోవాలని, అప్పుడు ప్రజల్లో నమ్మకం కలుగుతుందని రోజా అన్నారు. నిరుద్యోగ భృతి పేరుతో కొత్త ప్రభుత్వం మోసం చేసిందని, ఉద్యోగ హామీలను తూటాగా విసిరినా నెరవేర్చలేదని ఆమె విమర్శించారు.
Pete Hegseth: ఇరాన్ తో యుద్ధం చేయం.. అవే మా టార్గెట్.. అమెరికా క్లారిటీ